'కాలేజీకి పవన్ కళ్యాణ్ రాకలో రాజకీయం లేదు', సిద్ధం చేస్తున్న ఫ్యాన్స్
అనంతపురం: జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ నెల 11వ తేదీన గుత్తికి రానున్నారు. గుత్తిలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో ఆయన విద్యార్థులతో ముచ్చటించనున్నారు. అనంతరం ఓ సభ నిర్వహించనున్నారు.
పవన్ కళ్యాణ్ గుత్తి కాలేజీలో సభకు హాజరు కావడంలో ఎలాంటి రాజకీయం లేదని ఇంజినీరింగ్ కళాశాల అధినేత సుధీర్ రెడ్డి గురువారం తెలిపారు. ఇటీవల హైదరాబాదుకు వెళ్లి జిల్లాలో నెలకొన్ని కరువు పరిస్థితిని, గుంతకల్లు నియోజకవర్గ పరిస్థితిని వివరించినట్లు చెప్పారు. గుత్తికి రావాలని పవన్‌ను ఆహ్వానించానన్నారు.

ఇదిలా ఉండగా, ఈ నెల 10వ తేదీన అనంతపురంలో జనసేన సభ ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ అభిమానుల సంఘం నాయకులు మాట్లాడారు. పవన్ అనంతపురం పర్యటనను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
పదో తేదీన సాయంత్రం నాలుగు గంటలకు స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో జరగనున్న సభలో వేదిక నుంచి పవన్ మాట్లాడుతారని, ప్రత్యేక హోదా, అనంత కరువు, సాగు, తాగునీరు తదితర అంశాలపై మాట్లాడుతారని చెప్పారు. బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నామని, జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తరలి రావాలన్నారు.












Click it and Unblock the Notifications