స‌హ‌నం కోల్పోతున్న ప‌వ‌న్..! కోడి క‌త్తి అంశం ప‌ట్ల అలాగేనా స్పందించేదంటూ విమ‌ర్శ‌లు..!!

Recommended Video

    AP 2019 Elections : టిడిపి త్వ‌ర‌లో జ‌గ‌న్‌తోనూ పొత్తు పెట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్ | Oneindia

    హైద‌రాబాద్/ఏపి: ఆవేశానికి మారుపేరైన జ‌న‌సైనాని త‌రుచుగా స‌హ‌నం కోల్పోతున్నారు. రాజ‌కీయాల్లో ఎంతో స్థిత ప్ర‌జ్ఞ‌త చూపించాల్సిన త‌రుణంతో ప‌ట్టు త‌ప్పి ఆవేశంగా మాట్లాడుతున్నారు. సున్నిత‌మైన అంశాల ప‌ట్ల కూడా ఘాటుగా స్పందిస్తూ అందరి చేత విమ‌ర్శ‌ల‌కు గ‌రౌతున్నారు. తాజాగా ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ పై జ‌రిగిన దాడిపై ప‌వ‌న్ స్పందించిన తీరు విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. మండ‌పేట‌లో కోడిక‌త్తి గురించి జ‌న‌సైన స్పంద‌న వ్యంగ్యంగా ఉంద‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.

     ప‌వ‌న్ వ్య‌వ‌హారం పై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు..! కోడిక‌త్తిపై స్పంద‌న స‌రికాదంటున్న నేత‌లు..!

    ప‌వ‌న్ వ్య‌వ‌హారం పై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు..! కోడిక‌త్తిపై స్పంద‌న స‌రికాదంటున్న నేత‌లు..!

    జ‌న‌సేన అధిన‌త ప‌వ‌న్ క‌ల్యాణ్ తాజాగా మండ‌పేట బ‌హిరంగ స‌భ‌లో చేసిన వ్యాఖ్య‌లు ఆంధ్రప్ర‌దేశ్ లో స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతున్నాయి. త‌న‌కు ఏమైనా అయితే డీజీపీదే బాధ్య‌త అని, ఒక‌సారి అశాంతి చెల‌రేగితే ఆప‌డం ఎవ‌రి త‌ర‌మూ కాద‌ని ఆయ‌న చెప్పిన మాట‌ల వెనుక అస‌లు ఆంత‌ర్య‌మేంట‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చ‌ర్చించుకుంటున్నారు. ప్ర‌జ‌ల‌ను ప‌రోక్షంగా రెచ్చ‌గొట్టేందుకే ప‌వ‌న్ ఇలాంటి వ్యాఖ్య‌లు చేశారేమోన‌ని అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు రాజ‌కీయ నాయ‌కులు. ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్క‌ద‌న్న‌ ఆత్మ‌న్యూన‌త ఆయ‌న‌లో ఆవ‌హించింద‌ని ఎద్దేవా చేస్తున్నారు.

     స‌హ‌నం కోల్పోతున్న ప‌వ‌న్..! కోడిక‌త్తిపై స్పంద‌న స‌రికాదంటున్న నేత‌లు..!

    స‌హ‌నం కోల్పోతున్న ప‌వ‌న్..! కోడిక‌త్తిపై స్పంద‌న స‌రికాదంటున్న నేత‌లు..!

    ఇటీవల రాజానగరం సభకు వెళ్తుండ‌గా ప‌వ‌న్ కాన్వాయ్ ప్ర‌మాదానికి గురైంది. ఆయ‌న వాహ‌న‌శ్రేణిలోని ఓ కారును ఇసుక లారీ ఢీకొట్టంది. ఈ ప్ర‌మాదంలో 8 మంది సెక్యూరిటీ సిబ్బంది గాయ‌ప‌డ్డారు. ఆ త‌ర్వాత హైద‌రాబాద్‌లో జ‌న‌సేన సీనియ‌ర్ నేత నాదెండ్ల మ‌నోహ‌ర్ కారు ప్ర‌మాదానికి గురైంది. ఇక్క‌డా ఆయ‌న వాహ‌నాన్ని ఇసుక లారీయే ఢీకొంది. ఈ రెండు ప్ర‌మాదాలు కాక‌తాళీయ‌మో, ప‌క్కా ప్ర‌ణాళికో తెలియ‌రాలేదు. రెండు ఘ‌ట‌న‌ల‌పైనా పోలీసులు కేసు న‌మోదు చేశారు. ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఇది ఏపి రాజ‌కీయాల్లో సంచ‌ల‌నంగా మారింది.

     పవ‌న్ లో ఎందుకు అస‌హ‌నం..! ఆవేశం ఎందుకంటున్న నాయ‌క‌లు..!!

    పవ‌న్ లో ఎందుకు అస‌హ‌నం..! ఆవేశం ఎందుకంటున్న నాయ‌క‌లు..!!

    ఈ ప్ర‌మాదాల‌పై ప‌వ‌న్ మండ‌పేట స‌భ‌లో స్పందించారు. కోడి క‌త్తితో జ‌రిగిన చిన్న దాడికి జ‌గ‌న్ అరిచి గోల పెట్టార‌ని, అలా తాను చేయ‌బోన‌ని అన్నారు. ఏం చేయాలో త‌న‌కు తెలుసున‌ని పేర్కొన్నారు. బ‌య‌ట‌కు వ‌చ్చి తోలు తీస్తాన‌ని హెచ్చ‌రించారు. ఆ ధైర్యం త‌న‌కుంద‌న్నారు. ఒక‌వేళ త‌న‌కు, త‌న జ‌న సైనికుల‌కు ఏమైనా జ‌రిగితే డీజీపీయే బాధ్య‌త వ‌హించాల్సి ఉంటుంద‌ని సూచించారు.

    రాజ‌కీయాలంటే సంయ‌మ‌నం ఉండాలి..! ప‌వ‌న్ వ్య‌వ‌హారం బాగాలేదంటున్న ఏపి నేత‌లు..!

    రాజ‌కీయాలంటే సంయ‌మ‌నం ఉండాలి..! ప‌వ‌న్ వ్య‌వ‌హారం బాగాలేదంటున్న ఏపి నేత‌లు..!

    జ‌న‌సేనాని మాట్లాడిన తీరు ఆయ‌న అభిమానులు, ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్టేలా ఉంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. త‌న‌కు ఏదో జ‌ర‌గ‌బోతోంద‌న్న ఆందోళ‌న‌ను ప్ర‌జ‌ల్లో రేకెత్తించి.. దాని ద్వారా వారికి చేరువ కావాల‌ని ప‌వ‌న్ చూస్తుండొచ్చ‌ని వారు అంచ‌నా వేస్తున్నారు. త‌న‌ను కొంద‌రు చంపాల‌ని చూస్తున్నారంటూ గ‌తంలోనూ ప‌వ‌న్ హ‌డావుడి సృష్టించిన సంగ‌తిని గుర్తుచేస్తున్నారు. నిజంగా ప్రాణ‌హాని ఉంటే నేరుగా ముఖ్య‌మంత్రిని లేదా పోలీసు ఉన్న‌తాధికారుల‌ను క‌లిసి బాడీగార్డుల‌ను ఇవ్వాల్సిందిగా విన్న‌వించాలే త‌ప్ప ఇలా బ‌హిరంగ స‌భ‌ల్లో రెచ్చ‌గొట్టే మాట‌లు మాట్లాడ‌ట‌మెందుక‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+