ఏపీలో మళ్లీ ఆగిన పింఛన్లు..టీడీపీకి ఫుల్ డ్యామేజ్

ఏపీ రాజకీయాల్లో మరోసారి పింఛన్లు హాట్ టాపిక్‌గా మారాయి. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి వాలంటీర్ల చేత పింఛన్లను పంపిణీ చేయిస్తోంది. అయితే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో వాలంటీర్లను తొలగించాలని టీడీపీ నేతలతో పాటు, మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు చర్యలు తీసుకున్న ఎన్నికల సంఘం వాలంటీర్లను విధులకు దూరంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. వాలంటీర్లు తప్పుకోవడంతో ఆ ప్రభావం పింఛన్లపై పడింది. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చి పింఛన్లు తీసుకోవాలంటూ పెన్షన్‌దారులను అధికారులు కోరారు.

దీంతో ఫింఛన్ తీసుకునే వారు చాలా ఇబ్బందికి గురయ్యారు. మండుటెండలో క్యూలో నిల్చుని పింఛన్లు తీసుకున్నారు. ఎండ తీవ్రతను తట్టుకోలేక గత నెలలో ముగ్గురు వృద్దులు ప్రాణాలు సైతం విడిచారు. దీనిపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడిచింది. చంద్రబాబు అండ్ టీం ఫిర్యాదుతోనే పింఛన్లు కార్యక్రమం ఆగిపోయిందని వైసీపీ అధినేత జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయ వ్యవస్థతో పింఛన్ల పంపిణీ చేయకుండా..తమ మీద కావాలనే బురద చల్లుతున్నారంటూ వైసీపీకి టీడీపీ నాయకులు కౌంటరిచ్చారు. ఇదిలా ఉంటే మే1 తారీఖు రావడంతో ఏపీలో మరోసారి పింఛన్లపై చర్చ మొదలైంది.

Pensions have once again become a hot topic in AP politics

1 తారీఖు వచ్చినా పింఛన్లు చేతికి రాకపోవడంతో వృద్దులు ఇబ్బంది పడుతున్నారు. పైగా ఈ నెల పింఛన్లు చేతికి కాకుండా బ్యాంకు అకౌంట్‌కు వేయడం ఇప్పుడు మరో సమస్యగా మారింది. బ్యాంకు అకౌంట్‌లో డబ్బులు వేస్తే తీసుకోవడం ఎలా అంటూ పెన్షన్‌దారులు ప్రశ్నిస్తున్నారు. ఆ డబ్బులను తీసుకోవడానికి టౌన్‌కు వెళ్లాలంటూ వారు వాపోతున్నారు. ఆ బ్యాంకుల్లో క్యూలైన్లు..నిలబడడం..ఆ ఫారాలు నింపడం ..ఇదంతా పెద్ద సమస్య.. దానికితోడు కొన్ని బ్యాంకులు తమ ఖాతాల్లో కనీస నిల్వ (మినిమమ్ బ్యాలెన్స్ ) లేకపోతె కొంత పెనాల్టీ విధిస్తాయి.

పేదల ఖాతాల్లో నిత్యం మినిమమ్ బ్యాలెన్స్ ఉంటుందా అనేది సందేహమే... అలా వాళ్ళు బ్యాలెన్స్ ఉంచకపోతే పాపం వీళ్ళ ఖాతాల్లోకి వచ్చిన మూడు వేలలో కొంత కోత విధిస్తే అది తమకు నష్టం అని వారు ఆందోళన చెందుతున్నారు. పింఛన్ల ఆలస్యం కావడం, అకౌంట్స్‌లో వేయడం వల్ల వృద్ధులు, వికలాంగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే పింఛన్ల ఎఫెక్ట్ టీడీపీపై గట్టిగానే పడేలా కనిపిస్తోంది. పింఛన్లు గత నెలలో ఆలస్యం కావడం..ఇప్పుడు బ్యాంకు అకౌంట్స్‌లో పడటం అంతా కూడా టీడీపీ కుట్రే అని మెజార్టీ పెన్షన్‌దారులు నమ్ముతున్నారు. దీని ప్రభావం రేపు జరిగే ఎన్నికల్లో కచ్చింతంగా పడుతుందని రాజకీయ పరిశీలకులు సైతం చెబుతున్నారు. పెన్షన్ విషయంలో టీడీపీకి ఫుల్ డ్యామేజ్ జరిగినట్టే కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+