ప్రధానిని కలుస్తా - తిట్టుకుంటున్నారని చెబుతా: సీఎం జగన్..!!
ముఖ్యమంత్రి జగన్ కేంద్రం పైన కీలక వ్యాఖ్యలు చేసారు. పోలవరం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజికి సవరించిన అంచనా ఆమోదం కోసం పదే పదే కేంద్రాన్ని కోరుతున్నామని సీఎం వివరించారు. వరద ముంపు గ్రామాల పర్యటనల్లో భాగంగా.. వేలేరుపాడులో సీఎం అక్కడి నిర్వాసితులతో ముచ్చటించారు. తాజా వరదల నుంచి వారికి ఏ రకంగా సాయం అందిందీ అడిగి తెలుసుకున్నారు. ఇదే సమయంలో పోలవరం ముంపు గురించి గ్రామస్థులు అందోళన వ్యక్తం చేసారు.

ప్రధానిని కలుస్తా..ఉన్నదే చెబుతా
దీనికి స్పందనగా..తాను ప్రధానిని కలిసిన నాలుగు సందర్భాల్లో వెంటనే నిర్వాసితులకు చెల్లించాల్సిన మొత్తం విడుదల చేయాలని కోరానని చెప్పుకొచ్చారు. ఇక, ఆర్దిక - జనవనరుల శాఖా మంత్రి ప్రతీ నెలా ఢిల్లీ వెళ్లి ఈ నిధుల విడుదల గురించి అడుగుతూనే ఉన్నారని సీఎం వెల్లడించారు. మరోసారి తాను ప్రధాని అప్పాయింట్ మెంట్ కోరానని.. ఈ సారి గట్టిగానే కోరుతానన్నారు. నిర్వాసితులు మిమ్మల్నే తిట్టుకుంటున్నారని కూడా చెబుతానంటూ సీఎం వ్యాఖ్యానించారు. విషయం ఎంత సున్నింతగా ఉందో తెలియచేస్తానని చెప్పారు.

ప్రధానినే బటన్ నొక్కమంటాను
ప్యాకేజీ ప్రకటించి.. ప్రధానిని డీబీటీ కింద నేరుగా లబ్దిదారుకు అందేలా బటన్ నొక్కమని కోరుతానని సీఎం చెప్పుకొచ్చారు.తక్కువ మొత్తం అయితే తానే ఇచ్చేవాడినని.. 20 వేల కోట్లకు పైగా కావాల్సి ఉందని..అంత భారం కేంద్రం మాత్రమే ఇవ్వగలదన్నారు. పరిహారం కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తానన్నారు. పరిహారం ఇచ్చిన తరువాతనే ప్రాజెక్టులో నీటిని నింపుతామని సీఎం హామీ ఇఛ్చారు.
41.15 కాంటూరు పరిధిలోకి వచ్చే వారికి సెప్టెంబర్ నాటికి పరిహారం ఇస్తామని ప్రకటించారు. నిర్వాసితుల గతంలో ఎకరాకు ఇచ్చిన లక్షా లక్షా పది హెను వేల పరిహారాన్ని అదనంగా కలిపి మొత్తం 5 లక్షలు ఇస్తామన్నారు.

పరిహారం అందాకే..ప్రాజెక్టులో నీరు
అదే సమయంలో ప్రస్తుత వరదల కారణంగా నష్టపోయిన ప్రతీ కుటుంబానికి సాయం అందించామన్నారు. స్థానికులు సైతం జిల్లా అధికారులు అందించిన సాయం పైన సంతోషం వ్యక్తం చేసారు. వరదలు తగ్గుముఖం పట్టటంతో నష్టం పైన అంచనాలు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. ముంతు గ్రామాల వారికి త్వరగా సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైన పరిహారం అందించే ఏర్పాటు చేస్తామని..ఆ తరువాతనే పోలవరంలో నీరు నింపుతామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications