సంజీవయ్య పార్క్‌లో గర్ల్‌తో వ్యభిచారం, అరెస్ట్ (పిక్చర్స్)
హైదరాబాద్: బాలికపై సామూహిక అత్యాచారం చేసిన కేసులో పోలీసులు ఐదుగురు యువకులు, ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు.
బాలికకు మాయమాటలు చెప్పి తీసుకు వెళ్లి ఆమెను వ్యభిచారకూపంలోకి నెట్టిన ఏడుగురు నిందితులను చాంద్రాయణగుట్ట పోలీసులు శనివారం అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. చాంద్రాయణగుట్ట పరిధిలోని పూలబాగ్‌కు చెందిన పద్నాలుగేళ్ల బాలికకు హఫీజ్ నగర్‌కు చెందిన జరీ పనులు నిర్వహించే అబ్దుల్ షకీల్ రహ్మాన్‌తో పరిచయం ఉంది.

అరెస్టు
ఈ నెల 4వ తేదీన బాలిక అతనిని కలిసింది. అఏతను మాయ మాటలు చెప్పి బాలికను లొంగదీసుకొని హఫీజ్ బాబా నగర్లో నివసించే తన మిత్రుడు మహబూబ్‌కు చెందిన ఖాళీ నివాసానికి తీసుకు వెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. ఇలా బాలికను వ్యభిచర రొంపిలోకి దింపిన నిందితులు హఫీజ్ బాబా నగర్లోని అజర్ ఖాన్‌కు ఆమెను పరిచయం చేశారు.

అరెస్టు
అతడు ఆమెను బాలాపూర్లోని ఫౌజియా బేగం నివాసానికి తీసుకు వెళ్లి అత్యాచారం చేశాడు. అక్కడ మరికొంతమంది విటులతో వ్యభిచారం చేయించడానికి పురమాయించాడు. అక్కడికి ఫిరోజ్ ఖాన్ అనే నిందితుడు వచ్చి బాలికను తీగలకుంటలోని మరో నిందితురాలు ఫరీదాఖాతున్ నివాసానికి తీసుకు వెళ్లాడు.య తర్వాత బాలికను సంజీవయ్య పార్కుకు తీసుకు వెళ్లి నిందితుడు ఆమెతో విటులను ఆకర్షించే ప్రయత్నం చేశాడు.

అరెస్టు
తనను వ్యభిచారంలోకి దించారని ఎట్టకేలకు గ్రహించిన బాలిక విషయాన్ని తల్లికి ఫోనులో తెలిపింది. దీంతో పోలీసులు పథకం పన్ని నిందితులను రప్పించి అదుపులోకి తీసుకున్నారు.

అరెస్టు
అబ్దుల్ షకీల్ రహ్మాన్, మహ్మద్ బషీర్ ఖాన్, మహ్మద్ మహబూబ్, మహ్మద్ హమీద్, ఫిరోజ్ ఖాన్, ఫౌజీయా బేగం, ఫరీదాఖాతున్‌లను అదుపులోకి తీసుకున్నారు. నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితులకు ఉస్మానియాలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం కోర్టుకు తరలించారు.












Click it and Unblock the Notifications