నేనే సిఎంనని జగన్, టి 'బిసి'కని బాబు ఆఫర్ (పిక్చర్స్)
హైదరాబాద్/గుంటూరు: పేదవాడికి నిరంతరం అండగా ఉండి వారిగుండె తలుపు తట్టిన వైయస్ రాజశేఖర రెడ్డి పాలన రాష్ట్రంలో ఒక స్వర్ణ యుగమని, అటువంటి పాలనను మళ్లీ తీసుకొస్తానని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుస్తుందని చెప్పారు. తాను సిఎంను అవుతానని జగన్ గతంలోను పలుమార్లు చెప్పారు.
గుంటూరు జిల్లా కారంపూడి వచ్చిన ఆయన తొలుత రోడ్ షో నిర్వహించారు. కోటబురుజు వద్ద వైయస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడారు.
వైయస్ మరణించిన తరువాత వచ్చిన ముఖ్యమంత్రులు పేదవాడిని ఆదుకోలేకపోయారని, పదవి కాపాడుకోవడానికే కాలం వెల్లబుచ్చారు కానీ ప్రజల గోడు పట్టించుకోలేదని విమర్శించారు.

చంద్రబాబు
"తెలంగాణలో బిసి వర్గాలకు చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసే బాధ్యత నాది. ఎన్నికల కురుక్షేత్రంలో పోరాడటానికి మీరు నా సంకల్పానికి బలాన్ని ఇవ్వండి. క్షేత్రస్థాయిలోకి దూసుకెళ్లి బీసీలను చైతన్యపరచండి. నేను కూడా సైకిల్ స్పీడ్ పెంచుతా. బుల్లెట్‌లాగా దూసుకుపోతా. ఇతర పార్టీల దిమ్మతిరిగేలా ఫలితాలు సాధిద్దాం'' అంటూ బిసి నేతలకు చంద్రబాబు పిలుపునిచ్చారు.

కృష్ణయ్యతో
బిసి సంఘాల నేత ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో ఎన్టీఆర్ భవన్లో శుక్రవారం బిసి నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. నమ్మిన సిద్ధాంతం కోసం నాలుగు దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న గొప్ప వ్యక్తి కృష్ణయ్య అని చంద్రబాబు కొనియాడారు.

హాజరైన వారు
బిసిలకు వంద అసెంబ్లీ స్థానాలు ఇస్తామని ప్రకటించామని, పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణలో బిసి వర్గాలకు చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.

బిసి నేతతో ముచ్చట
తెలంగాణ రాదనుకునే ఎస్సీని ముఖ్యమంత్రిని, ముస్లింను ఉప ముఖ్యమంత్రిని చేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారని, తీరా తెలంగాణ వచ్చిన తర్వాత పదవుల ఊసే ఎత్తడం లేదని ఎద్దేవా చేశారు.

బాబుకు విజ్ఞప్తి
తెలంగాణ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వస్తే ఆర్ కృష్ణయ్యను ముఖ్యమంత్రిని చేయాలంటూ ఆయన వెంట వచ్చిన బిసినేతలు చంద్రబాబును కోరారు. దీంతో, మీరంతా పార్టీలో చేరాలి కదా అని చంద్రబాబు వ్యాఖ్యానించారట.

బాబు హామీ
టిడిపిలో చేరాలంటూ ఆర్ కృష్ణయ్యను కూడా ఆయన ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. బాబు ప్రతిపాదనపై ఆలోచించుకుని రెండు మూడు రోజుల్లో చెబుతామని ఆర్ కృష్ణయ్య చెప్పారని తెలుస్తోంది.

గుంటూరు
పేదవాడికి నిరంతరం అండగా ఉండి వారిగుండె తలుపు తట్టిన వైయస్ రాజశేఖర రెడ్డి పాలన రాష్ట్రంలో ఒక స్వర్ణ యుగమని, అటువంటి పాలనను మళ్లీ తీసుకొస్తానని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.

జగన్
గుంటూరు జిల్లా కారంపూడి వచ్చిన ఆయన తొలుత రోడ్ షో నిర్వహించారు. కోటబురుజు వద్ద వైయస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడారు.

ఓదార్పు
వైయస్ మరణించిన తరువాత వచ్చిన ముఖ్యమంత్రులు పేదవాడిని ఆదుకోలేకపోయారని, పదవి కాపాడుకోవడానికే కాలం వెల్లబుచ్చారుకానీ ప్రజల గోడు పట్టించుకోలేదని విమర్శించారు.

హాజరైన భారీ జనం
వైయస్ రాజశేఖర రెడ్డి వంటి మహనీయుని పాలన మళ్లీ రాష్ట్రంలో తీసుకురావాలనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీని స్థాపించినట్లు చెప్పారు.

జగన్ సమక్షంలో...
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థులను గెలిపించి రాష్ట్రంలో అధికారాన్ని ఇవ్వడమే కాకుండా పార్లమెంట్‌లో తెలుగువాడి ఆత్మగౌరవాన్ని వినిపించేంత సంఖ్యలో ఎంపీలను గెలిపించాలని ఆయన కోరారు.

ఓదార్పు
వైయస్ మరణించిన తరువాత వచ్చిన ముఖ్యమంత్రులు పేదవాడిని ఆదుకోలేకపోయారని, పదవి కాపాడుకోవడానికే కాలం వెల్లబుచ్చారుకానీ ప్రజల గోడు పట్టించుకోలేదని విమర్శించారు.












Click it and Unblock the Notifications