పవన్ సినిమాలు చూడను, చిరు వల్లే: కెసిఆర్(పిక్చర్స్)
హైదరాబాద్: కొత్త పార్టీలు వస్తున్నాయని ఆగం కావొద్దని, మోసపోవద్దని.. సంక్రాంతి పండుగ ముందు గంగిరెద్దులోళ్లు వచ్చినట్లు.. ఎన్నికల ముందు వాళ్లు వస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కొత్త పార్టీ పెట్టే ప్రయత్నాల్లో ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు విరుచుకు పడ్డారు.
టిడిపి వరంగల్ జిల్లా మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి నెహ్రునాయక్, వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు శుక్రవారం తెలంగాణ భవన్‌లో తన సమక్షంలో తెరాసలో చేరిన సందర్భంగా కెసిఆర్ మాట్లాడారు.
కిరణ్ కూడా కొత్త పార్టీ పెట్టి మాట్లాడుతున్నాడని, ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి చట్టం కూడా అయిపోయిందని, దానిని ఎవరూ ఆపలేరన్నారు. చిత్తూరు జిల్లాకే చెందిన గాలి ముద్దుకృష్ణమనాయుడు సీమాంధ్ర, తెలంగాణను కలిపి ఎపిని చేస్తాడట అని విరుచుకుపడ్డారు.

తెరాసలోకి
టిడిపి వరంగల్ జిల్లా మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి నెహ్రునాయక్, వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు శుక్రవారం తెలంగాణ భవన్‌లో తన సమక్షంలో తెరాసలో చేరిన సందర్భంగా కెసిఆర్ మాట్లాడారు.

కెసిఆర్
ఎవరో పవన్ కల్యాణ్ అట... అతని సినిమాలు తాను చూడనే లేదని, అసలు సినిమాలే తక్కువ చూస్తానని, చిరంజీవి తమ్ముడని ఎవరో అన్నారని, అన్న దుకాణం అయిపోయింది, ఇక తమ్ముని దుకాణం మొదలైతాందా? అని కెసిఆర్ ఎద్దేవా చేశారు.

చంద్రశేఖర రావు
కల్యాణో.. గిల్యాణో... సినిమా యాక్టర్నో.. ఇంకొకర్నో చూసి ఆగమైతే.. మనం ఆగమైపోతామన్నారు. అనేక బాధలు పడి తెలగాణ తెచ్చుకున్నామని, మొత్తం 17 ఎంపీ స్థానాల్లో మనమే గెలవాలన్నారు. అప్పుడే ఢిల్లీని శాసించి.. మెడలు వంచి ఏ ప్రాజెక్టు కావాలంటే, అది తెచ్చుకోవచ్చన్నారు.

తెరాస
మనం అనుకున్నంత బాగా తెలంగాణ రాలేదని, స్థూలంగా హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణ వచ్చినప్పటికీ, కొన్ని విషయాల్లో అసంతృప్తి ఉందని, వాటన్నింటినీ సాధించే ఆవశ్యకత ఉందన్నారు.

ఇంకా పోరాటం
రాష్ట్రం ఏర్పడ్డా ఇంకా పోరాటం మిగిలే ఉందన్నారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పాసైన తదుపరి మనం ఒప్పుకోకున్నా..ఆంధ్రా వాళ్లు పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలుపుకున్నారని, ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను కావూరి సాంబశివరావు, పల్లం రాజు, చిరంజీవి.. అంతా కలిసి తెలంగాణకు కాకుండా చేశారన్నారు.

గవర్నర్‌తో తెరాస నేతలు
కాగా, గవర్నర్ నరసింహన్‌ను తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు పలువురు శుక్రవారం మధ్యాహ్నం రాజ్ భవన్లో కలిశారు. జూపల్లి, హరీశ్వర్ రెడ్డి, పోచారం తదితరులు కలిశారు.












Click it and Unblock the Notifications