మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెసిఆర్: కత్తి పట్టారు, గులాబీ తలపాగా (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

సంగారెడ్డి: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఎన్నికల నగారా మోగించారు. మెదక్ జిల్లా జోగిపేటలో ఆయన మంగళవారం సాయంత్రం భారీ బహిరంగ సభలో పాల్గొని ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఆయన తన ప్రసంగంలో తెలంగాణను ఎలా అభివృద్ధి చేస్తాననే విషయం గురించి మాట్లాడారు.

బహుశా, మొదటిసారి కెసిఆర్ అవినీతి గురించి మాట్లాడారు. అవినీతి అంతం చూస్తానని, ఎవరైనా సరే అవినీతికి పాల్పడితే కూతురైనా, కుమారుడైనా జైలుకు వెళ్లాల్సిందే అనే కొత్త నినాదాన్ని ఎత్తుకున్నారు. జోగిపేటలో ఆయన ఘన స్వాగతం లభించింది.

కెసిఆర్ బహిరంగ సభ సందర్భంగా గిరిజన నృత్యాలు కనువిందు చేశాయి. కళాకారులు ఆటాపాటలతో అలరించారు. ఆయన మెడలో గులాబీ రంగు కుండువాను వేసుకోవడంతో పాటు తలకు గులాబీ రంగు పాగా చుట్టుకుని కొత్తగా కనిపించారు.

జైపాల్ రెడ్డికి గులాబీ కండువా..

జైపాల్ రెడ్డికి గులాబీ కండువా..

గులాబీ కండువా కప్పి జైపాల్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు పార్టీలోకి ఆహ్వానించారు. పక్కన శాసనసభ్యుడు రవీందర్ రెడ్డి కూడా ఉన్నారు.

భారీగా తరలిన ప్రజలు..

భారీగా తరలిన ప్రజలు..

జోగిపేటలోని కెసిఆర్ బహిరంగ సభకు పెద్ద యెత్తున ప్రజలు తరలి వచ్చారు. తెలంగాణ ప్రజల జీవితాలను బాగు చేస్తానని కెసిఆర్ హామీ ఇచ్చారు.

వేదికపై కెసిఆర్..

వేదికపై కెసిఆర్..

జోగిపేట బహిరంగ సభలో కెసిఆర్ తెలంగాణ ప్రజలకు తన నాయకత్వంపై నమ్మకం కల్పించే ప్రయత్నం చేసారు. బంగారు తెలంగాణ గురించి మాట్లాడారు.

గిరిజన నృత్యాలు..

గిరిజన నృత్యాలు..

జోగిపేట కెసిఆర్ బహిరంగ సభలో గిరిజన నృత్యాలు ప్రజలను అలరించాయి. గిరిజన సంస్కృతికి అద్దం పట్టే విధంగా నృత్యాలు సాగాయి.

హరీష్ రావు ఇలా..

హరీష్ రావు ఇలా..

మెదక్ శాసనసభ్యుడు హరీష్ రావు కెసిఆర్‌కు జోగిపేటలో స్వాగతం చెప్పారు. మెదక్ జిల్లాలో అభ్యర్థుల విజయాన్ని హరీష్ రావు భుజాన వేసుకున్నట్లు కనిపిస్తున్నారు.

కెసిఆఆర్ దండాలు..

కెసిఆఆర్ దండాలు..

జోగిపేట సభకు వచ్చిన ప్రజలకు కెసిఆర్ తనదైన శైలిలో దండాలు పెడుతూ కనిపించారు. బలహీనవర్గాలకు నమ్మకం కల్పించేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు.

కత్తి పట్టారు..

కత్తి పట్టారు..

కెసిఆర్ తెలంగాణ ఎన్నికల్లో దూసుకుపోయేందుకే అన్నట్లు కత్తి పట్టారు. ఇలా ప్రదర్శన ఇచ్చారు కూడా..

బాల కళాకారిణితో ఇలా..

బాల కళాకారిణితో ఇలా..

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఓ బాలకళాకారణితో ఇలా కనిపించారు.

English summary
Telangana Rastra Samithi (TRS) president K Chandrasekhar Rao first time spoke about corruption at Jogipet public meeting in Medak district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X