మోడీ మాస్క్: బాబు, పవన్ కరచాలనం (పొటోలు)

తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌ (సీమాంధ్ర)లో బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి సభలో చాలా ఉత్సాహంగా కనిపించారు. బుధవారం రాత్రి జరిగిన ఎన్నికల ప్రచార సభలో తెలంగాణలో జరిగిన సభల్లో కన్నా భిన్నమైన వాతావరణం కనిపించింది.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని మోడీ పదే పదే ప్రస్తావిస్తూ ఆయనను ప్రశంసించారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు స్నేహపూర్వకంగా మాట్లాడుకున్నారు. ఇరువురు కరచాలనం చేశారు. చంద్రబాబుకు తన మద్దతు ఉంటుందని పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పారు. ఈ సమయంలో చంద్రబాబు ముఖంలో నవ్వు కనిపించింది.

మోడీ తన పేరు ప్రస్తావిస్తూ తనను ప్రస్తావించినప్పుడు చంద్రబాబు గతంలో ఎన్నడూ లేని విధంగా నవ్వుతూ కనిపించారు. మోడీ ప్రసంగానికి మధ్య మధ్యలో చంద్రబాబు కరతాళ ధ్వనులు చేయడం కూడా కనిపించింది.

టిడిపి జెండా రెపరెపలు..

టిడిపి జెండా రెపరెపలు..

మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తిరుపతిలో బుధవారం రాత్రి పాల్గొన్న బహిరంగ సభలో టిడిపి జెండాలు రెపరెపలాడాయి. 01 (4).JPG

చంద్రబాబుతో వెంకయ్య

చంద్రబాబుతో వెంకయ్య

తిరుపతి వేదిక మీద బిజెపి సీనియర్ నేత వెంకయ్య నాయుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో మాట్లాడుతూ ఇలా కనిపించారు.

ముగ్గురిదీ ఒక్కటే మాట...

ముగ్గురిదీ ఒక్కటే మాట...

చంద్రబాబు, మోడీ, పవన్ కళ్యాణ్ సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు, కాంగ్రెసు పార్టీలను ఓడించడానికి ఇలా వేదిక మీదికి వచ్చారు.

బాబు, పవన్ కరచాలనం

బాబు, పవన్ కరచాలనం

తెలంగాణ సభలో చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు. తిరుపతి సభలో మోడీ సమక్షంలో మాత్రం ఇరువురు కరచాలనం చేసుకున్నారు.

మోడీ మాస్క్

మోడీ మాస్క్

నరేంద్ర మోడీ మాస్క్ ధరించిన ఓ వ్యక్తి బిజెపి జెండాతో తిరుపతి సభలో ఇలా హల్‌చల్ చేశాడు. సభ ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగింది.

ఎన్టీయే పోస్టర్‌పై పవన్ కళ్యాణ్

ఎన్టీయే పోస్టర్‌పై పవన్ కళ్యాణ్

ఎన్డీయే పోస్టర్‌పై మోడీ, రాజ్‌నాథ్ సింగ్, వాజ్‌పేయి చిత్రాలతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిత్రం కూడా కనిపించింది.

మోడీకి స్వాగతం..

మోడీకి స్వాగతం..

మోడీ హవాను తనకు అనుకూలంగా మార్చుకోవడానికి బిజెపితో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు మోడీకి ఇలా స్వాగతం చెప్పారు.

మోడీతో కలిసి బాబు ఇలా...

మోడీతో కలిసి బాబు ఇలా...

నరేంద్ర మోడీతో కలిసి చంద్రబాబు నాయుడు తిరుపతి సభ వేదిక మీదికి ఇలా వచ్చారు. తమ జోడీ విజయం సాధిస్తుందని మోడీ నమ్ముతున్నారు.

వెంకయ్యతో మోడీ..

వెంకయ్యతో మోడీ..

తమ పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడితో వేదికపై మాట్లాడుతూ మోడీ ఇలా కనిపించారు. మోడీ రాకకు ముందు వెంకయ్య ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

వెంకయ్య అనువాదం

వెంకయ్య అనువాదం

తెలంగాణలో మోడీ ప్రసంగానికి తెలుగు అనువాదం అవసరం లేకుండా పోయింది. కానీ తిరుపతి సభలో అది తప్పలేదు. మోడీ ప్రసంగాన్ని వెంకయ్య నాయుడు తెలుగులోకి అనువదించారు.

మోడీ ప్రసంగం చేస్తున్నప్పుడు...

మోడీ ప్రసంగం చేస్తున్నప్పుడు...

నరేంద్ర మోడీ ప్రసంగిస్తున్నప్పుడు వెంకయ్య నాయుడు అనువాదం చేస్తుండగా పవన్ కళ్యాణ్ ఇలా ఆలోచనా ముద్రలో నిలుచుండిపోయారు. చంద్రబాబు ముఖంలో నవ్వు కనిపించింది.

పవన్ కళ్యాణ్‌తో మాటామంతీ...

పవన్ కళ్యాణ్‌తో మాటామంతీ...

నరేంద్ర మోడీ నవ్వుతూ పవన్ కళ్యాణ్‌తో మాట్లాడుతుంటే అది వింటూ చంద్రబాబు కనిపించారు. ముగ్గురూ కూడా నవ్వుతూ కనిపించారు.

చంద్రబాబు ఇలా...

చంద్రబాబు ఇలా...

చంద్రబాబు తన ప్రసంగంలో పదే పదే మోడీ పేరును ప్రస్తావించారు. పవన్ కళ్యాణ్ పేరును కూడా ఆయన రెండు మూడు సార్లు ప్రస్తావించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+