మోడీ కోసం తొలిసారి వెంకయ్య టీ తాగారు (పిక్చర్స్)
విజయవాడ: తమ పార్టీ నేత నరేంద్ర మోడీని ప్రధాన మంత్రిని చేయాలనే ఉద్దేశంతో బిజెపి సీనియర్ నేత ఎం. వెంకయ్యనాయుడు చాయ్ తాగారు. తన జీవితంలో మొదటిసారి టీ తాగుతున్నానని ఆయన చెప్పారు. నరేంద్ర మోడీని ప్రధాని చేయాలనే ప్రచారంలో భాగంగా బుధవారంనాడు విజయవాడలో వెంకయ్య నాయుడు చాయ్ తాగి, ప్రచారాన్ని ప్రారంభించారు. విజయవాడ గాంధీనగర్‌లో ఆయన టీ స్టాల్‌ను ప్రారంభించారు.
చాయ్ విక్రయించడం ద్వారా జీవితాన్ని ప్రారంభించిన మోడీకి కాంగ్రెసు చేసిన విమర్శ బాగానే పనికి వస్తున్నట్లుంది. టీ బాయ్ ప్రధాని అవుతారా అంటూ కాంగ్రెసు నాయకుడు మణిశంకర్ అయ్యర్ అప్పట్లో అన్నారు. దాన్ని బిజెపి తనకు అనుకూలంగా మలుచుకుని ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. చాయ్ దుకాణం నడిపినవారు ప్రధాని కావచ్చునంటూ ప్రచారం ప్రారంభించింది.
టీ అమ్ముకునేందుకు కాంగ్రెసు ప్లీనరీ వద్ద నరేంద్ర మోడీకి స్థలం ఇస్తామని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మణిశంకర్ అయ్యర్ ఇటీవల వ్యాఖ్యానించారు. దాన్నే బిజెపి తన ప్రచారాస్త్రంగా ఎంచుకుంది. అయ్యర్ వ్యాఖ్యలు వేలాది మంది టీ అమ్ముకునేవారిని అవమానించడమేనని వెంకయ్య నాయుడు అన్నారు.

వెంకయ్య టీ తాగారు 1
నరేంద్ర మోడీని ప్రధానిని చేయడానికి చేపట్టిన ప్రచార కార్యక్రమంలో భాగంగా ఎం. వెంకయ్య నాయుడు బుధవారం విజయవాడ గాంధీ నగర్‌లో టీ స్టాల్ ప్రారంభించారు.

వెంకయ్య టీ తాగారు 2
విజయవాడలో ఎం. వెంకయ్య నాయుడు టీ బాయ్‌గా అవతరించారు. గ్లాసులో కెటిల్ నుంచి టీ ఒంపుతూ ఇలా కనిపించారు.

వెంకయ్య టీ తాగారు 3
మోడీని ప్రధానిని చేసే ప్రచార కార్యక్రమంలో భాగంగా టీ బాయ్‌తో పోస్టర్ పట్టించి, వెంకయ్య నాయుడు టీ చేయించారు.

వెంకయ్య టీ తాగారు 4
సీనియర్ బిజెపి నేత ఎం. వెంకయ్య నాయుడు టీ స్టాల్‌లో కెటిల్ నుంచి టీ ఒంపుతూ చాయ్ గ్లాసులు అందిస్తూ ఇలా ప్రచారం సాగించారు.

వెంకయ్య టీ తాగారు 5
నరేంద్ర మోడీని ప్రధానిని చేయడానికి వెంకయ్య తన జీవితంలో పెట్టుకున్న ఓ నిబంధనను ఉల్లంఘించి తొలిసారి టీ తాగారు.

వెంకయ్య టీ తాగారు 6
నరేంద్ర మోడీ పేరు మీద ఎం. వెంకయ్య నాయుడు బుధవారంనాడు విజయవాడలోని గాంధీ సెంటర్‌లో టీ స్టాల్ ప్రారంభించారు.

వెంకయ్య టీ తాగారు 7
వెంకయ్య నాయుడు వేడి వేడి టీ చప్పరించి, విజయవాడలో లోకసభ ఎన్నికల వేడిని రగిలించారు. సాధారణ ప్రజలను ఆకర్షించే పనికి పూనుకున్నారు.

వెంకయ్య టీ తాగారు 8
వెంకయ్య నాయుడు బుధవారం విజయవాడలో టీ స్టాల్ ప్రారంభించి, టీ చప్పరించి, ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.

వెంకయ్య టీ తాగారు 9
వేడి వేడి టీ చప్పరించిన వెంకయ్య నాయుడు కాంగ్రెసుపై వాడిగా విమర్శనాస్త్రాలు సంధించారు. నో డౌట్ కాంగ్రెసు ఔట్ అంటూ చెప్పేశారు.












Click it and Unblock the Notifications