Pithapuram:పవన్‌కు అంత సీన్ లేదు..గీత నోట సంచలన నిజాలు..!

Vanga Geetha:ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ లోక్‌సభ ఎన్నికలు మే 13వ తేదీన జరగనున్నాయి. ఇక పోలింగ్‌కు కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో అన్ని పార్టీలు తమ ప్రచారంలో వేగాన్ని పెంచాయి. ప్రతి తలుపు తడుతూ తమకు ఓటు వేయాల్సిందిగా అభ్యర్థులు ఓటర్లను కోరుతున్నారు. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెబుతూ ప్రతిపక్షాలు ఓట్లు అడుగుతుండగా.. తమ పాలన చూసి అమలు చేసిన హామీలను చూసి అధికార పార్టీ వైసీపీ ఓటర్ల దగ్గరకు వెళుతోంది. ఇక ఏపీలో హాట్‌సీట్‌గా ఈ సారి పిఠాపురం అసెంబ్లీ స్థానం కనిపిస్తోంది. గతంలో భీమవరం గాజువాకలో ఓటమి పాలైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తుండటమే ఇందుకు కారణం. ఆయన ప్రత్యర్థిగా వైసీపీ నుంచి వంగా గీత బరిలో ఉన్నారు. వంగా గీత అంత సెలబ్రిటీని ఎలా ఎదుర్కొనబోతున్నారు, ఆమె వ్యూహం ఎలా ఉండబోతోంది అనే పలు ఆసక్తికర విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసింది వన్ ఇండియా.

పిఠాపురం కూటమి అభ్యర్థిగా జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీలో ఉన్నారు. ఇక పిఠాపురంలో ఎటు చూసినా సినిమా ఇండస్ట్రీ లేదా బుల్లితెర సెలబ్రిటీలే కనిపిస్తూ పవన్ తరపున ప్రచారం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ లక్ష మెజార్టీతో పిఠాపురంలో గెలవబోతున్నట్లు వారు చెబుతున్నారు. ఇదే విషయం గురించి వంగా గీత దగ్గర వన్ ఇండియా ప్రస్తావించగా తనదైన శైలిలో కౌంటిరిచ్చారు. లక్ష ఓట్ల మెజార్టీతో నిజంగానే పవన్ కళ్యాణ్ గెలిచే సత్తా ఉంటే సెలబ్రిటీలు, సినిమా ఇండస్ట్రీ పెద్దలు, క్రీడారంగంకు చెందిన వారు ఇక్కడకు వచ్చి ప్రచారం చేయాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. పవన్ కళ్యాణే ఒక స్టార్‌డమ్ ఉన్న వ్యక్తికి ఈ సో కాల్డ్ ఇండస్ట్రీ సెలబ్రిటీల అవసరం ఏముంటుందని ప్రశ్నించారు.

Pithapuram Vanga Geetha confident of victory says pawan kalyan humself is a star-deets here

పవన్ కళ్యాణ్ కోసం మెగా హీరోలు పిఠాపురంకు క్యూ కట్టడాన్ని వంగా గీత ఏమాత్రం తప్పుపట్టలేదు. ఎవరు ఎవరికోసమైనా వచ్చి ప్రచారం చేసుకోవచ్చని అన్నారు. అయితే గెలిచిన తర్వాత ఎవరు ప్రజలకు అందుబాటులో ఉంటారనే విషయాన్ని ఆలోచన చేసి ఓటు వేయాలని ఆమె వన్‌ఇండియా ద్వారా పిలుపునిచ్చారు. కాకినాడ పిఠాపురం హోటల్స్ అన్నీ పవన్ కోసం ప్రచారం చేసే వారితో నిండిపోయాయని చెప్పిన గీత తన వెనక జగన్ ఉన్నారనే కాన్ఫిడెన్స్ వ్యక్తం చేశారు. అంతేకాదు తాను ఎమ్మెల్యేగా, ఎంపీగా పిఠాపురం అభివృద్ధికి ఎలాంటి పనులు చేశానో ప్రజలకు తెలుసనే ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

పవన్ కళ్యాణ్ గెలిస్తే తాను పిఠాపురంలో ఉంటాడా అనేదానిపై స్పష్టత లేదని చెప్పిన వంగా గీత ఆయన సినిమాలు పూర్తి చేయాల్సినవి, ఇంకా ప్రారంభం కానివి చాలా ఉన్నాయని వాటితోనే ఐదేళ్లు గడిచిపోతాయని అన్నారు. ఇంక ప్రజలకు అందుబాటులో ఎప్పుడుంటారని ప్రశ్నించారు. అదే సమయంలో ఆయన సెలబ్రిటీ స్టేటస్ కలిగి ఉన్నందున సామాన్యుడు తన సమస్య చెప్పుకోవాలంటే సెక్యూరిటీని దాటుకుని పవన్ వద్దకు వెళ్లలేడని ఆమె అన్నారు. ఇక చిరంజీవి పిఠాపురంకు తమ్ముడి తరపున ప్రచారం కోసం వస్తారా అన్న ప్రశ్నకు... ఆయన రాడనే నమ్మకం ఉందని వంగా గీత చెప్పారు. ఒకవేళ వచ్చినా వంగా గీతపై విమర్శలు గుప్పించరని, చిరంజీవికి వంగా గీత ఏమిటో ఎలాంటిదో తెలుసని చెప్పుకొచ్చారు. ఇక వంగా గీత మా ప్రతినిధి కోట కార్తీక్‌తో మరిన్ని అంశాలపై మాట్లాడిన పూర్తి ఇంటర్య్వూ మీ కోసం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+