చంద్రబాబు తాజా ప్రతిపాదనకు మోదీ ఆమోదం - ముహూర్తం ఫిక్స్..!!
ఏపీలో కీలక సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వ్యూహాత్మక నిర్ణయాలు అమలు చేస్తున్నారు. అమరావతి - పోలవరం కేంద్రం గా కేంద్రం - ఏపీ ప్రభుత్వం వరుస నిర్ణయాలు తీసుకుంటున్నాయి. గతం కంటే భిన్నంగా కేంద్రం ఇప్పటికే అమరావతితో పాటుగా పోలవరం కు నిధులు మంజూరు చేసింది. ప్రపంచ బ్యాంకు నుంచి అమరావతికి తొలి దశ నిధులు విడుదలయ్యాయి. ఇదే సమయంలో అమరావతి కేంద్రంగా చంద్రబాబు ప్రతిపాదనకు ప్రధాని మోదీ ఆమోదం తెలిపారు.
కీలక నిర్ణయం
కూటమి ప్రభుత్వం కొత్త రాజధాని అమరావతి విషయంలో వ్యూహాత్మక నిర్ణయాలు అమలు చేస్తోంది. ఇప్పటి వరకు ఆర్దిక వనరుల సమీకరణ పైన ఫోకస్ చేసిన కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు నిర్మాణాల పైన కసరత్తు చేస్తోంది. పలు నిర్మాణాలకు టెండర్లు ఖరారు చేసింది. ఇక, కీలకమైన ఐకానిక్ టవర్స్ టెండర్లు పిలిచేందుకు సిద్దమైంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా అమరావతి నిర్మాణ పనులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అమరావతికి ప్రధాని అమరావతి పనుల రీ లాంఛ్ కోసం ప్రధాని మోదీని ఆహ్వానించాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఇదే అంశం పైన ఢిల్లీ పర్యటనలో చర్చించారు. ఈ వారంలో ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు.. ప్రధానితో భేటీ అయి అమరావతికి ఆహ్వానించనున్నారు. అమరావతి పనుల ప్రారంభ ఘట్టం అట్టహాసంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. నవనగరాల నిర్మా ణం లో భాగంగా ప్రధాని తో ఆ సిటీలకు శంకుస్థాపన చేయించనుంది.

ముహూర్తం ఫిక్స్
ఈ నెలలోనే 23 లేదా 24 తేదీల్లో ప్రధాని అమరావతికి వచ్చే అవకాశం ఉందని. ఇక, టెండర్లు పూర్తయిన వాటి నిర్మాణాలకు షెడ్యూల్ ఖరారు చేస్తోంది. ఐకానిక్ భవనాల కోసం అమరావతి పునర్నిర్మాణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంకా మిగిలి ఉన్న ముఖ్యమైన పనులకు టెండర్లు పిలిచే పనిలో సీఆర్డీఏ అధికారు లు కసరత్తు చేస్తున్నారు. అమరావతి ప్రభుత్వ సముదాయంలోనే అత్యంత కీలకమైన ఐకానిక్ టవర్లకు వచ్చే వారం టెండర్లు పిలవాలని భావిస్తున్నారు. ఐదు టవర్ల నిర్మాణానికి ప్రస్తుత ధరల మేరకు రూ. 4,687 కోట్ల వ్యయానికి ప్రభుత్వం పాలనాపరంగా ఆమోదించింది. గతంలో లాగే ఈసారి కూడా మూడు ప్యాకేజీలుగా టెండర్లు ఖరారు చేస్తున్నారు. జేఏడీ టవర్ బేస్‌మెంట్, గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా 47 అంతస్తులు కాగా, మిగిలిన 4 హెచ్‌ఓడీ టవర్లు 39 అంతస్తులుగా డిజైన్ చేశారు.
ప్రధాని పర్యటన వేళ
సీఆర్డీఏ అధికారులు ఇప్పటికే రాయగడ ఉక్కు పరిశ్రమతో పాటు బళ్లారిలోని జిందాల్ కర్మాగారం, తిరుచిరాపల్లిలోని ఎవర్‌సెందై వర్క్‌షాపులను పరిశీలించారు. రాయగడలో ఉక్కు కొని బళ్లారి, తిరుచిరాపల్లిలో ఫ్యాబ్రికేట్ చేయనున్నారు. త్వరలోనే మద్రాస్ ఐఐటీ నిపుణు వచ్చి పునాదుల పటిష్టతను పరిశీలించనున్నారు. రాజధానిలో సువిశాలమైన రహదారులు నిర్మానం చేసి చైన్నై-కోల్‌కతా హైవేతో పాటు ఇన్నర్ రింగ్ రోడ్డుకు అనుసంధానించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇన్నర్ రింగ్ రోడ్డుకు రాజధానిలోని అన్ని ప్రధాన రోడ్లను అనుసంధానించేలా డీపీఆర్ రూపొందిస్తున్నారు. అమరావతిలో మొత్తంగా రూ 64,721 కోట్ల ఖర్చుతో ప్రారంభిస్తున్న నిర్మాణ పనులను 2028 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది. అమరావతి పర్యటనలో ప్రధాని ఏపీకి ఇచ్చే హామీ పైన ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications