గర్ల్‌తో అసభ్యంగా..: ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య

Police arrested three youth
హైదరాబాద్: పదిహేడేళ్ల బాలికతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వేధింపులకు పాల్పడుతున్న ముగ్గురు యువకులను ముషీరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ముషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలోని రంగానగర్ బొంతల బస్తీలో నివసించే బాలికను స్థానికులైన రాములు, సురెందర్, షబ్బీర్‌సు గత కొంతకాలంగా అసభ్య పదజాలంతో వేధిస్తున్నారు.

ఎన్నిసార్లు హెచ్చరించినా వారు తగ్గలేదు. దీంతో వారు బాలిక తన తల్లికి చెప్పింది. వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ముగ్గురు యువకులను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

భర్తను చంపిన భార్య

వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని కట్టుకున్న భర్తను ఇద్దరు వ్యక్తులతో కలిసి భార్య హతమార్చిన సంఘటన రెండు నెలల తర్వాత వెలుగులోకి వచ్చింది. నార్సింగి పోలీసుల కథనం ప్రకారం మహబూబ్ నగర్ జిల్లా దౌల్తాబాద్ మండలం అంతారం గ్రామానికి చెందిన లక్ష్మప్ప పదిహేనేళ్ల క్రితం అమృత అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు.

వీరికి ఇద్దరు పిల్లలున్నారు. వారు కూలీ పని చేస్తున్నారు. ఆమృత రెండుసార్లు స్వగ్రామానికి ఒంటరిగా వెళ్లింది. గత వారం ఓటు వేయడానికి వచ్చిన ఆమెను గ్రామస్థులు భర్త గురించి అడిగారు. అయితే తాను హత్య చేసినట్లు చెప్పింది.

అంతారం గ్రామస్థులు నార్సింగి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని గుర్తించారు. అమృతను, వివాహేతర సంబంధం కలిగిన గోపాల్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని తీసుకువచ్చి పోస్టుమార్టం నిమిత్తం పంపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+