జగన్ పర్యటన ఎఫెక్ట్: అంబటి, నేతలు, కార్యకర్తల 'రప్పా రప్పా' పై కేసులు

మాజీ ముఖ్యమంత్రి జగన్ పల్నాడు పర్యటన వివాదాస్పదంగా మారింది. జగన్ పర్యట పైన పోలీసులు ఆంక్షలు విధించారు. గతంలో చోటు చేసుకున్న పరిణామాలతో.. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తుగా ఈ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే, జగన్ పర్యటనను వైసీపీ నేతలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. భారీగా జనం తరలి వచ్చారు. ఈ సమయంలోనే కొందరు కార్యకర్తలు వివాదాస్పద వ్యాఖ్యలతో ప్లకార్డులు ప్రదర్శించారు. వీరితో పాటుగా మరి కొందరు వైసీపీ నేతల పైన పోలీసులు కేసు నమోదు చేసారు.

వైసీపీ అధినేత.. మాజీ సీఎం జగన్ సత్తెనపల్లి పర్యటన వేళ అనూహ్య పరిణామాలు చోటు చేసుకు న్నాయి. జగన్ పర్యటన వేళ ఆంక్షలను ఉల్లంఘించిన పార్టీ నేతలు.. కార్యకర్తల పైన పోలీసులు కేసు నమోదు చేసారు. పర్యటన సమయంలో కంటెపూడి వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్ల ను మాజీ మంత్రి అంబటి రాంబాబు స్వయంగా తెలిగించారు. ఈ సమయంలో పోలీసులతో వాగ్వా దం జరిగింది. దీంతో.. అంబటి దురుసుగా వ్యవహరించిన కారణంగా అంబటి పైన నాలుగు కేసు లు నమోదు చేసారు. అదే విధంగా జగన్ పర్యటన సమయంలో కొందరు కార్యకర్తలు ప్రదర్శించిన ప్లకార్డుల పైన వివాదాస్పద స్లోగన్లు ఉన్నాయి.

Police cases registered against YSRCP leaders who violate rules in Jagan Palnadu tour

2029లో వైసీపీ వచ్చిన వెంటనే.. గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రప్పా రప్పా నరుకుతాం ఒక్కొక్కడిని అంటూ ఫ్లెక్సీలో రాసుకొచ్చారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. తాజాగా రవితేజను అరెస్ట్ చేశారు. ఇలాంటి వివాదాస్పద ప్లకార్డులు ప్రదర్శించిన మరో నలుగురి పైనా కేసులు నమోదయ్యాయి. రప్ప రప్పా నరకుతాం అంటూ ప్లకార్డు చూపించిన రవితేజను నకరికల్లులో విచారణ చేస్తున్నారు. మిగిలిన ఇద్దరి కోసం గాలింపు కొనసాగుతోంది.

ఇదే సమయంలో పార్టీ నేతలు సుధీర్ భార్గవ్, గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి పై నిబంధనల ఉల్లంఘన కేసు నమోదు అయింది. అంబటి పైన 188,332, 353, 427 సెక్షన్ల కింద కేసు నమోదు అయింది. ఈ పర్యటన పైన జగన్ స్పందించారు. రెంటపాళ్ల పర్యటన సక్సెస్ అయినట్లు చెప్పుకొచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం విధించిన ఆంక్షలతోనే పార్టీ శ్రేణులు ఈ స్థాయిలో వచ్చారని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+