పోలీసు ఆత్మహత్య: సంపులో పాప మృతి (పిక్చర్స్)

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పాతబస్తీ ఛత్రినాఖ పోలీస్టేషన్ పరిధిలో డ్యూటీలో ఉన్న ఒ పోలీస్ కానిస్టేబుల్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం యూసుఫ్‌గూడ పోలీస్ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న ఎపిఎస్‌పి బెటాలియన్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ మనోహర్ కుమారుడైన కిర్‌ణ్‌ కుమార్ (29) గత కొంత కాలం నుండి ఛత్రినాఖ పోలీస్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు.

ఫలక్‌నూమ రైల్వేస్టేషన్ సమిపంలోని కట్టమైసమ్మ దేవాలయం వద్ద పోలీస్ ఔట్‌పోస్టులో విధులు నిర్వహిస్తున్నాడు. డ్యూటీలో ఉండగానే అతను ఉరి వేసుకుని మృతి చెందాడు. అతని మృతిపై పలు అనుమనాలు వ్యక్తం అవుతున్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీస్ అధికారులు ఉస్మానియా అసుపత్రికి తరలించారు.

నీటి సంపులో పడి పదేళ్ల బాలిక హైదరాబాదులోని సరూర్‌నగర్‌లో మరణించింది. నల్లగొండ జిల్లా సంస్థాన్ నారాయణపూర్‌ మండలం రోళ్లబండ తండాకు చెందిన వాంకుతోడు రుక్క తన ఇద్దరు పిల్లలతో సరూర్‌నగర్ చౌరస్తాలోని మెగా సిటీ గ్రామర్ స్కూల్లో ఆయాగా పనిచేస్తోంది. గురువారం పాఠశాలకు తన కూతురు లావణ్య (10)ను తీసుకుని వచ్చింది.

పాఠశాల గేటు వద్ద ఆడుకుంటూ లావణ్య ప్రమాదవశాత్తు సంపులో పడి మరణించింది. ఆ సమయంలో తల్లి రుక్క పాఠశాల పై అంతస్తును శుభ్రం చేస్తోంది. పని అయిపోగానే కిందికి వచ్చి చూసిన రుక్క బిడ్డ కనిపించకపోవడంతో వెతికింది. బిడ్డ సంపులో పడి ఉండడం చూసి గుండెలు బాదుకుంటూ రోదించింది.

కానిస్టేబుల్ ఆత్మహత్య

కానిస్టేబుల్ ఆత్మహత్య

హైదరాబాదులోని పాతబస్తీలో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. కిరణ్ కుమార్ అనే ఈ కానిస్టేబుల్ పని ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు.

సంపులో పడి బాలిక మృతి

సంపులో పడి బాలిక మృతి

హైదరాబాదులోని సరూర్‌నగర్ ప్రాంతంలో లావణ్య అనే పదేళ్ల బాలిక సంపులో పడి మృత్యువాత పడింది. ఆడుకుంటూ వెళ్లి సంపులో పడింది.

బోరున ఏడ్చిన తల్లి

బోరున ఏడ్చిన తల్లి

తన కూతురు లావణ్య సంపులోపడి మరణించడంతో తల్లి రుక్క బోరున ఏడ్చింది. ఆమెను అదుపు చేయడం కష్టమైంది.

కారులోంచి తోసిసి చంపారు

కారులోంచి తోసిసి చంపారు

హైదరాబాదులోని హిమాయత్ సాగర్ వద్ద ఓ మహిళపై దుండగులు రేప్ చేసి, ఆమెను హత్య చేసి రోడ్డుపై పడేసి పారిపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+