నల్గొండ ఎన్‌కౌంటర్: ఆశ్రయమిచ్చిందెవరు, మూడో వ్యక్తి కోసం కూంబింగ్

హైదరాబాద్: నల్లగొండ జిల్లా ఎన్‌కౌంటర్ నేపథ్యంలో పోలీసులు అర్వపల్లి సమీపంలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ముష్కరులు అస్లాం, జకీర్‌లు ఆశ్రయం పొందిన ప్రాంతంలో పోలీసులు విస్తృతంగా కూంబింగ్ చేస్తున్నారు. సీతారాంపురంలోని దర్గాలో సిమి ఉగ్రవాదులుగా భావిస్తున్న అస్లాం, జకీర్‌లు ఆశ్రయం పొందారు. వారికి ఎవరు సహకరించారన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

దర్గాలో విధులు నిర్వహించే మౌలానా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. అతని కాల్ డేటాను సేకరిస్తున్నారు. ముష్కరులు తమ వెంట తెచ్చుకున్న ల్యాప్‌టాప్, మరికొంత విలువైన సమాచారాన్ని దర్గా పరిసరాల్లో ఉన్న గుట్టల్లో దాచిపెట్టారని పోలీసులు అనుమానిస్తున్నారు. వాటి కోసం కూడా అన్వేషిస్తున్నారు. దర్గా పరిసరాలను పోలీసులు తమ ఆదీనంలోకి తీసుకున్నారు.

తుంగతుర్తి మండలం కుక్కడంలో అనుమానాస్పదంగా హిందీలో మాట్లాడుతూ తిరుగుతున్న వ్యక్తిని ప్రశ్నించిన స్థానికులు అతడిని వెంబడించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అతను వెళ్లిన ముప్పారం వైపు అన్వేషిస్తున్నారు. మూడు రోజుల క్రితం సూర్యాపేట పోలీసులను హతమార్చిన సమయంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లు బాధితులు గుర్తించారు. దీంతో మరో వ్యక్తి అదే పరిసరాల్లో ఉండి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

Police Kumbing for third suspect in Nalgonda district

కాగా ఉగ్రవాదులు అస్లాం, జకీర్‌ల మృతదేహాలకు నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం పూర్తి అయింది. నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రిలో ఉగ్రవాదుల మృత దేహాలను ఉంచారు. వారం రోజుల్లో వారి సంబంధీకులు వస్తే మృతదేహాలను అప్పగిస్తామని పోలీసులు వెల్లడించారు. ఎవరూ రాకుంటే నిబంధనల ప్రకారం మృత దేహాలను ఖననం చేస్తామని పోలీసులు తెలిపారు.

నల్గొండ జిల్లా ఎన్‌కౌంటర్‌లో నేర చరిత్ర నివ్వెరపోయేలా చేస్తోంది. మధ్యప్రదేశ్‌లోని ఖాండువా జైలు నుంచి తప్పించుకున్న ఉగ్రవాదులు అస్లాం, జకీర్‌ దొంగతనాలకు కూడా తెగబడ్డారు. తెలంగాణలోని చొప్పదండి గ్రామీణ బ్యాంక్‌లో రూ. 46 లక్షలు ఎత్తుకెళ్లారు. వీరు ఎన్‌ఐఎ మోస్ట్‌ వాంటెడ్‌ ట్రెరరిస్టులను తెలుస్తోంది.

తుపాకీ తలపై పెట్టి హిందీలో బెదిరించారు

ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన ఇద్దరు దుండగులు ఘటనకు ముందు శనివారం ఉదయం రెండు బైకులను అపహరించుకుని పోయారు. తొలుత అర్వపల్లి మండల కేంద్రంలో ఓ బైకును, కొద్దిసేపటికే బిక్కేరు వాగు వద్ద మరో బైకును అపహరించారు. వారు తుపాకులు తలపై పెట్టి హిందీలో బెదిరించి, ఎత్తుకెళ్లారంటున్నారు. మరో బైకుకు తాళం వేసి ఉండగా ఎత్తుకెళ్లారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+