వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వంగలపూడి అనిత ఫిర్యాదు ఎఫెక్ట్: పొలిటికల్ పంచ్ రవికిరణ్ అరెస్ట్

పొలిటికల్ పంచ్ నిర్వాహకుడు ఇంటూరి రవికిరణ్‌ను విశాఖ పోలీసులు మంగళవారం నాడు అరెస్టు చేశారు. ఆయనపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేశారు.

|
Google Oneindia TeluguNews

విశాఖ: పొలిటికల్ పంచ్ నిర్వాహకుడు ఇంటూరి రవికిరణ్‌ను విశాఖ పోలీసులు మంగళవారం నాడు అరెస్టు చేశారు. ఆయనపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేశారు.

<strong>పొలిటికల్ పంచ్ ఇలాగే: బాబుకు రవికిరణ్ షాక్, జగన్ సహా జైలుకెళ్తారని వార్నింగ్ </strong>పొలిటికల్ పంచ్ ఇలాగే: బాబుకు రవికిరణ్ షాక్, జగన్ సహా జైలుకెళ్తారని వార్నింగ్

రవికిరణ్‌ను పోలీసులు విచారించారు. విచారణ అనంతరం అరెస్టు చేసినట్లు పోలీసులు ప్రకటించారు. ఏప్రిల్ 19వ తేదీన ఎమ్మెల్యే అనిత ఫిర్యాదు చేశారు. దళిత ఎమ్మెల్యే అయిన తనను కించపరిచేలా పోస్టింగులు పెట్టారని ఆమె ఫిర్యాదు చేశారు.

అరెస్టు

అరెస్టు

పొలిటికల్ పంచ్ నిర్వాహకుడు రవికిరణ్‌ను గత నెల హైదరాబాద్ నుంచి తీసుకు వెళ్లడం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆయన ఆచూకీ లేదంటూ అతని భార్య హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం అతనిని ఏపీ పోలీసులు తీసుకు వచ్చి ఇంటి వద్ద వదిలి పెట్టారు.

పలుమార్లు విచారణ

పలుమార్లు విచారణ

అనంతరం పలుమార్లు ఆయనను విచారించారు. ఏపీ మండలి కార్యాలయంపై అభ్యంతరకర ఫోటోలు పెట్టారని విచారించారు. అలాగే, ఎమ్మెల్యే అనిత, మంత్రి నారా లోకేష్, సీఎం చంద్రబాబు వంటి వారిపై అనుచిత పోస్టింగులు పెట్టారని టిడిపి నేతలు ఆరోపించారు.

రవికిరణ్‌తో పాటు వైసిపి ఐటీ వింగ్ చీఫ్‌ను

రవికిరణ్‌తో పాటు వైసిపి ఐటీ వింగ్ చీఫ్‌ను

ఈ నేపథ్యంలో ఆయనను తుళ్లూరు పోలీసులు పలుమార్లు విచారించారు. ఆయన వైసిపి కోసం పని చేస్తున్నారని టిడిపి ఆరోపించింది. ఈ నేపథ్యంలో రవికిరణ్‌తో పాటు వైసిపి ఐటి వింగ్ చీఫ్‌ను కూడా పోలీసులు విచారించారు.

అనితపై పోస్టింగులపై విచారణ

అనితపై పోస్టింగులపై విచారణ

పోస్టింగులను తొలుత సమర్థించుకున్న రవికిరణ్ ఆ తర్వాత మాత్రం తగ్గారు. అలాంటి పోస్టులు పెట్టవద్దని తనకు తెలియదని చెప్పారు. అనంతరం అనితపై పెట్టిన పోస్టులపై విచారణ జరిపారు. అయితే అనితపై తాను ఎలాంటి కామెంట్లు పెట్టలేదని ఆయన అంతకుముందు చెప్పారు.

English summary
Political Punch Inturi Ravi Kiran arrested again on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X