పవన్ కళ్యాణ్‌కు నో, బాబు ఒకప్పుడు డైనమిక్ కానీ, జగన్ ఆఫర్‌కు నో చెప్పా: పోసాని

ప్రధాని నరేంద్ర మోడీ తన వద్దకు వచ్చి... బిజెపికి ప్రచారం చేస్తే రాజ్యసభ సీటు ఇస్తానని చెప్పినా తాను వైసిపి అధినేత వైయస్ జగన్‌కే ప్రచారం చేస్తానని ప్రముఖ సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళి అన్నారు.

హైదరాబాద్/అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీ తన వద్దకు వచ్చి... బిజెపికి ప్రచారం చేస్తే రాజ్యసభ సీటు ఇస్తానని చెప్పినా తాను వైసిపి అధినేత వైయస్ జగన్‌కే ప్రచారం చేస్తానని ప్రముఖ సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళి అన్నారు.

గతంలో ప్రజారాజ్యం తరఫున పోటీ చేయాలని చిరంజీవి అడిగినట్లుగా, రేపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అడిగినా.. జగన్‌కే ప్రచారం చేస్తానని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. తనను ఎలాంటి ప్రలోభాలకు గురి చేసినా జగన్‌కే తన ఓటు అన్నారు.

జగన్ ఆఫర్ చేసినా వద్దన్నా

జగన్ ఆఫర్ చేసినా వద్దన్నా

తాను ఓ నిర్ణయం తీసుకున్న తర్వాత తిరుగు ఉండదని, తన వ్యక్తిత్వమే అంత అని పోసాని చెప్పారు. పదవి ఇస్తానని జగన్ ఆఫర్ చేసినా తనకు అక్కర్లేదని చెప్పానన్నారు. జగన్ పోటీ చేయమన్నా చేయనని తేల్చి చెప్పారు. పోసాని ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

జనసేనకు ఓటేయను

జనసేనకు ఓటేయను

తాను వచ్చే ఎన్నికల్లో టిడిపికి లేదా జనసేన పార్టీకి ఓటు వేయనని పోసాని తేల్చి చెప్పారు. చంద్రబాబు సమర్థుడైన నాయకుడు అని, అందుకే గత ఎన్నికల్లో ఆయనకు ఓటు వేశానని చెప్పారు. చంద్రబాబులో అప్పుడు కనిపించిన సమర్థత ఇప్పుడు లేదన్నారు. ఒకప్పుడు ఆయన డైనమిక్ అని చెప్పారు.

అప్పుడు చంద్రబాబు డైనమిక్

అప్పుడు చంద్రబాబు డైనమిక్

చంద్రబాబు ముందుకు ఇదివరకు ఎలాంటి సమస్య వెళ్లినా దాని అంతు చూసేవారని పోసాని చెప్పారు. ఇప్పుడు రాజకీయాల్లో కుల, మతాల ప్రాబల్యం పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే, ఎవరినైనా ఏమైనా అంటే ఆ ప్రభావం ఎన్నికల్లో పడుతుందని చంద్రబాబు మౌనంగా ఉంటున్నారన్నారు.

అందుకే బాబుకు నో, జగన్‌ను రేపు చూశాక

అందుకే బాబుకు నో, జగన్‌ను రేపు చూశాక

అందుకే చంద్రబాబుకు ఓటేయడం లేదని పోసాని ప్రస్తుత పరిస్థితిని బట్టి జగన్‌కే తన ఓటు అని చెప్పారు. అయితే జగన్‌ను ఇంత వరకు చూడలేదని, రేపు ఆయన పరిపాలనా విధానం చూసిన తర్వాత రేపు ఆయనపై ఓ నిర్ణయానికి వస్తానని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+