చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శాడిస్ట్ భర్త కేసులో కొత్త మలుపు, నోటీసులు!: నపుంసకత్వంపై ఆయన ఎక్కడా చెప్పలేదు కానీ

|
Google Oneindia TeluguNews

చిత్తూరు: శాడిస్ట్ భర్త రాజేష్‌కు నంపుంసక పరీక్షలు చేయనున్నారు. పోలీసులు మంగళవారం సాయంత్రం నోటీసులు ఇచ్చారని తెలుస్తోంది. లైంగిక పటుత్వ పరీక్షల కోసం రాజేష్ అంగీకరిస్తే వైద్యులు ఆయనను పరీక్షించనున్నారు.

ఒకవేళ లైంగిక పటుత్వ పరీక్షలకు రాజేష్ అంగీకరించకుంటే మాత్రం ఆయన బార్య శైలజ వాదనకు బలం చేకూరనుంది. ఆయన సంసారానికి పనికి రాడని ఆమె చెబుతున్నారు. ఆయన నో చెబితే ఆ వాదన నిజం కానుంది.

ఫస్ట్ నైట్ వేధింపులు: శాడిస్ట్ భర్త రాజేష్‌కు నపుంసక పరీక్షలు! మగతనం లేదని తేలితేఫస్ట్ నైట్ వేధింపులు: శాడిస్ట్ భర్త రాజేష్‌కు నపుంసక పరీక్షలు! మగతనం లేదని తేలితే

రాజేష్ చెప్పలేదు

రాజేష్ చెప్పలేదు

తాను సంసారానికి పనికి రానని భర్త రాజేష్ ఎక్కడా చెప్పలేదు. భార్య శైలజ, ఆమె కుటుంబ సభ్యులు ఈ వాదన వినిపిస్తున్నారు. తాను సంసారానికి పనికి రానని, కానీ నిన్ను మంచిగా చూసుకుంటానని, మరెవరితోనైనా అఫైర్ పెట్టుకోవచ్చునని భర్త రాజేష్ భార్య శైలజతో చెప్పాడని అంటున్నారు.

పోలీసుల విచారణలో

పోలీసుల విచారణలో

భర్త రాజేష్ తనకు నపుంసకత్వం ఉందని చెప్పినట్లుగా బంధువులు చెబుతున్నారు. కానీ ఆయన ఎక్కడా నేరుగా చెప్పలేదు. అయితే పోలీసుల విచారణలో మాత్రం తాను సంసారానికి పనికి రానని, అందుకే తన భార్యను వేడుకున్నానని చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి.

కొత్త మలుపు తిరగనుందా

కొత్త మలుపు తిరగనుందా

రాజేష్ పోలీసుల నోటీసులకు అంగీకరిస్తారా లేదా తెలియాల్సి ఉంది. పోలీసుల నోటీసులకు నో చెబితే కేసు కొత్త మలుపు తిరగనుందని అంటున్నారు. అలా కాకుండా టెస్టులకు సరేనని చెబితే ఏమవుతుందనేది ఆసక్తికరంగా మారింది.

జర్నలిస్టుల ఆందోళన

జర్నలిస్టుల ఆందోళన


ఇదిలా ఉండగా, తిరుపతి స్విమ్స్ ఆసుపత్రి వద్ద మంగళవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాజేష్ చేతిలో గాయపడిన సైలజ కేసు కవరేజీకి వెళ్లిన మీడియా ప్రతినిధులపై స్విమ్స్ సిబ్బంది దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. దాడి ఘటనపై నిరసన వ్యక్తం చేస్తూ జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు.

English summary
Potency test for Rajesh, police to issues notices.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X