ప్రభాస్ కు ముందే అనుమానం వచ్చింది!

'ఆదిపురుష్‌' (Adipurush) సినిమా చుట్టూ వివాదాలు ముసురుకున్న సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఈ చిత్రం రాణిస్తూనే ఉంది. ఇప్పటికి రూ.375 కోట్లు వసూలు చేసినట్లు ఆదిపురుష్ టీమ్ చెబుతోంది. ఈ సందర్భంగా ప్రభాస్ కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 'ఆదిపురుష్‌' సినిమా షూటింగ్‌ నాలుగు రోజులు పూర్తయిన తర్వాత తాను పోషిస్తున్న రాఘవుడి పాత్రపై ప్రభాస్ అనుమానం వ్యక్తం చేసినట్లు ఆ వీడియోలో ఉంది.
'రాధేశ్యామ్‌' ప్రమోషన్స్‌లో భాగంగా మాట్లాడిన ఆ వీడియోను ప్రభాస్‌ అభిమానులు ఇప్పుడు షేర్‌ చేస్తున్నారు. పనిలో పనిగా దర్శకుడు ఓం రౌత్‌ పనితీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు.

 prabhas

నాలుగు రోజులు ఆదిపురుష్ షూటింగ్ జరిగిన తర్వాత ఓం రౌత్ ను పిలిచి ఈ సినిమా చేయవచ్చా? అని అడిగాను. ఎందుకంటే అంతకుముందు ఇలాంటి పాత్ర చేయలేదు. ఇతర సినిమాల విషయంలో తప్పు జరిగినా పర్వాలేదుకానీ ఆదిపురుష్ విషయంలో తప్పు జరగకూడదు. అందుకే దర్శకుడిని పిలిచి మరీ అడిగినట్లు ప్రభాస్ చెబుతున్నారు. తానున్నానని, ఎటువంటి భయాలు పెట్టుకోవద్దని ఓంరౌత్ ప్రభాస్ కు అభయమిచ్చారు. రామాయణాన్ని ఇష్టం వచ్చినట్లు తీయడం సరికాదని, తమ హీరో ముందే హెచ్చరించినా ఓంరౌత్ మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఆదిపురుష్ తీశాడని ప్రభాస్ అభిమానులు మండిపడుతున్నారు.

 prabhas

దర్శకుడు ఓం రౌత్ మాత్రం ఆదిపురుష్ ను సమర్ధిస్తున్నారు. రామాయణం చాలా విస్త్రతమైందని, దాన్ని ఉన్నది ఉన్నట్లు తీయడం ఎవరికీ సాధ్యం కాదని, టీవీలో చూసిన రామాయణం చాలా పెద్దదన్నారు. ఆదిపురుష్ మొత్తం రామాయణం కాదని, కేవలం యుద్ధకాండనే చూపించామంటున్నారు. అయితే యుద్ధకాండలో కూడా చిన్న భాగమే తీశామంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+