2019 కోసం జగన్‌కు ప్రశాంత్ కిషోర్ కీలక సూచన, పవన్ కళ్యాణ్‌తో కలిసేనా?
ఏపీ రాజకీయాలు ఎప్పటికప్పుడు ఆసక్తికరంగా మారుతున్నాయి. 2019 నాటికి ఏ పార్టీ ఏ పార్టీతో వెళ్తుంది, ఎవరు ఒంటరిగా వెళ్తారనే అంశం ఎప్పటికప్పుడు చర్చకు దారి తీస్తోంది.
అమరావతి: ఏపీ రాజకీయాలు ఎప్పటికప్పుడు ఆసక్తికరంగా మారుతున్నాయి. 2019 నాటికి ఏ పార్టీ ఏ పార్టీతో వెళ్తుంది, ఎవరు ఒంటరిగా వెళ్తారనే అంశం ఎప్పటికప్పుడు చర్చకు దారి తీస్తోంది.
టిడిపి, బిజెపి పొత్తు అంశంపై తేలిపోయినట్లే కనిపిస్తోంది. అంతలోనే మళ్లీ అనుమానాలు కలుగుతున్నాయి. ఆ రెండు పార్టీల మధ్య పొత్తుపై ఇరు పార్టీల నేతలు ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు. అయినప్పటికీ తేలినట్లుగా కనిపించడం లేదు.
మరోవైపు, ప్రతిపక్షాలు కూడా ఎవరు ఎవరితో వెళ్తారనేది చర్చకు దారి తీస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే టిడిపి - బిజెపిలకు దూరమైనట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన లెఫ్ట్ పార్టీల వైపు చూస్తున్నారు.

అందరూ సిద్ధమంటున్నారు
ప్రత్యేక హోదా అంశమే ఆయుధంగా జనసేన, లెఫ్ట్ పార్టీలు 2019 ఎన్నికల బరిలోకి దిగాలని భావిస్తున్నాయి. అదే సమయంలో ప్రత్యేక హోదా కోసం ఏ పార్టీతోనైనా కలిసి పని చేస్తామని పవన్ కళ్యాణ్, లెఫ్ట్ నేతలు చెబుతున్నారు.

దానిపై లెఫ్ట్ ఆగ్రహం
వైసిపి అధినేత జగన్‌తోను కలిసేందుకు వారు సంసిద్ధత వ్యక్తం చేశారు. కానీ ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ, ఆ తర్వాత ఆయనను ప్రశంసించడంతో లెఫ్ట్ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ప్రశాంత్ కిషోర్ సూచన
అయితే, టిడిపి-బిజెపిల పొత్తు దాదాపు కొనసాగే పరిస్థితులు కనిపిస్తుండటంతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. జగన్‌కు ఓ సూచన చేసినట్లుగా ప్రచారం సాగుతోంది. ఆయన కూటమి అంశాన్ని తెరపైకి తెచ్చారని అంటున్నారు.

2019లో అధికారంలోకి రావాలంటే..
2014 ఎన్నికల్లో టిడిపి-బిజెపి కూటమి, పవన్ కళ్యాణ్ మద్దతు కారణంగా జగన్‌కు దెబ్బపడింది. 2019లో ఎలాగైనా అధికారంలోకి రావాలని వైసిపి చూస్తోంది. ఈ నేపథ్యంలో బిజెపిపై ఆశలు పక్కన పెట్టి టిడిపి-బిజెపియేతర పార్టీలతో కలిసి ఓ కూటమిగా ఎన్నికలకు వెళ్లాలని సూచించారని తెలుస్తోంది.

జగన్-పవన్‌లు దగ్గరవుతారా
ఇప్పటికే ఏపీలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్‌కు అధికార యావ లేదు. లెఫ్ట్ పార్టీలు కూడా జగన్‌తో పని చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇలా విపక్షాలతో కలిసి ముందుకు వెళ్లాలని సూచించారని తెలుస్తోంది. ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తోంది. ఇందులో భాగంగా సభను నిర్వహించనుంది. ఈ సభకు పవన్, జగన్‌లను కూడా ఆహ్వానిస్తోన్న విషయం తెలిసిందే.
-
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!! -
పార్లమెంట్ లో అమరావతి బిల్లు వేళ చంద్రబాబు, జగన్ ఎత్తుకు పైఎత్తులు..! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
అమరావతి పై కేంద్రం భారీ శుభవార్త, కొత్త చరిత్ర..!! -
పేద, మధ్యతరగతి ప్రజలకు బిగ్ షాక్.. ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్ !! -
Tamil Nadu Election Survey: పవన్ ఫీట్ రిపీట్ చేస్తున్న విజయ్ ? తేల్చేసిన తాజా సర్వే..! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications