అది జగన్ అపరిపక్వతకు నిదర్శనం: పత్తిపాటి, బాబును అభినందిస్తూ జానా లేఖ
హైదరాబాద్/విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైయస్ జగన్మోహన్ రెడ్డి రాననడం ఆయన అపరిపక్వతకు నిదర్శనమని మంత్రి పతిప్తపాటి పుల్లారావు అన్నారు.
రాజధాని శంకుస్థాపన ఓ చారిత్రక ఘట్టమని, ఈ మహత్తర కార్యక్రమంలో అందరూ పాలుపంచుకోవాలని చూస్తారని అన్నారు. అయితే జగన్ మాత్రం అందరికీ భిన్నంగా వ్యవహరిస్తున్నారన్నారు.
జగన్ తీరుపట్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోని నేతలే బాధపడుతున్నారన్నాని అన్నారు. ఎంతటి శత్రువులైనా శుభకార్యంలో పలకరించుకుంటారని మంత్రి పత్తిపాటి పుల్లరావు చెప్పారు.

చంద్రబాబుకు అభినందనలు తెలుపుతూ జానారెడ్డి లేఖ
ఏపీ రాజధాని శంకుస్థాపనకు తనను ఆహ్వానించిన నేపథ్యంలో తెలంగాణ సీఎల్పీ నేత జానారెడ్డి తిరిగి ఏపి సిఎం చంద్రబాబుకు లేఖ రాశారు. రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి తనకు ఆహ్వానం అందిందని, ఆహ్వానం పంపినందుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు లేఖలో పేర్కొన్నారు.
అలాగే రాజధాని నిర్మాణానికి చంద్రబాబు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. అందుకు సహకారం అందిస్తున్న ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. అలాగే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకోవాలని, ఇరు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నట్టు జానారెడ్డి తన లేఖలో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications