అనుభవజ్ఞుడైన నాయకుడు చంద్రబాబు: ప్రధాని మోదీ కితాబు.. సెలబ్రేషన్స్ ఇలా

ఒకపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న వేళ, టిడిపి అధినేత ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు సినీ రాజకీయ ప్రముఖుల నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువగా మారుతున్నాయి. టిడిపి అధినేత చంద్రబాబును ఉద్దేశించి భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ ఖాతా నుండి ట్వీట్ చేశారు.

ఏపీ సర్వతోముఖాభివృద్ధికి అంకితమయ్యారు చంద్రబాబు
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు అంటూ పేర్కొన్న ప్రధాని మోదీ, చంద్రబాబు అనుభవజ్ఞుడైన నాయకుడు అంటూ కితాబిచ్చారు. ఆయన ఎప్పుడూ ఏపీ సర్వతోముఖాభివృద్ధికి అంకితమయ్యారు అని. ప్రజల సేవలో ఆయన దీర్ఘాయుష్షుతో, ఆరోగ్యంగా జీవించాలని ప్రార్థిస్తున్నానని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

Prime Minister Modi birthday wishes to CBN said Experienced leader Chandrababu

సైబర్ టవర్స్ వద్ద చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు
ఇదిలా ఉంటే టిడిపి అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలను హైదరాబాద్లోని ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. సైబర్ టవర్స్ వద్ద చంద్రబాబు జన్మదిన వేడుకలు జరిపారు. హైటెక్ సిటీ సైబర్ టవర్స్ వద్ద ఐటీ ఉద్యోగులు కేక్ కట్ చేసి చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. నీ వల్లనే మేము ఇప్పుడు ఇక్కడ ఉన్నాం అంటూ ఐటి ఉద్యోగులు చంద్రబాబుకు సంబంధించి బ్యానర్ లను ప్రదర్శించారు.

ఖమ్మంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు
హ్యాపీ బర్త్డే సిబిఎన్ అంటూ నినాదాలు చేశారు. ఇదిలా ఉంటే ఖమ్మం ఎన్టీఆర్ భవన్లో చంద్రబాబు అభిమానులు 74 కేజీల కేక్ కట్ చేసి అందరికీ పంచి సంబరాలు జరుపుకున్నారు. అంతేకాదు చంద్రబాబు జన్మదిన సందర్భంగా ఉద్దండరాయుని పాలెం కు చెందిన దళిత జేఏసీ నాయకుడు, రైతు పులి చిన్నా చంద్రబాబు జన్మదిన సందర్భంగా ఎవరెస్ట్ శిఖరం ఎక్కుతూ విషెస్ చెప్పారు.

16 వేల 676 అడుగుల ఎత్తున చంద్రబాబు కు శుభాకాంక్షలు చెప్పిన అభిమాని
సముద్ర మట్టానికి 16 వేల 676 అడుగుల ఎత్తున ఉన్న మౌంట్ ఎవరెస్ట్ మార్గమధ్యలోని నాగర్ శంగ్ పర్వతంపై చంద్రబాబు చిత్రపటాన్ని ఎగరవేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టి రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఎవరెస్టు శిఖరం ఎంత ఎత్తుకు తీసుకువెళ్లాలని పులి చిన్న ఆకాంక్షించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+