ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి వ్యాఖ్యలపై విద్యార్థుల ఆందోళన, తప్పుబట్టిన మంత్రి గంటా

ఆంధ్రాయూనివర్శిటీపై ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.ఈ వ్యాఖ్యలపై విద్యార్థులు విశాఖలో ఆందోళనకు దిగాయి.

విశాఖపట్టణం: ఆంధ్రాయూనివర్శిటీపై ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.ఈ వ్యాఖ్యలపై విద్యార్థులు విశాఖలో ఆందోళనకు దిగాయి. అంతేకాదు తనకున్న విద్యా సంస్థను ప్రమోట్ చేసుకొనేందుకుగాను మూర్తి ఆంధ్రాయూనివర్శిటీని దయ్యాలకొంపగా అభివర్ణించాడని విద్యార్థులు ఆరోపణలు చేస్తున్నారు.ఈ వ్యాఖ్యలపై మంత్రి గంటా శ్రీనివాస్ రావు కూడ ఆగ్రహాం వ్యక్తం చేశారు.

విశాఖలో మహానాడు సందర్భంగా ఆంధ్రాయూనివర్శిటీ ప్రాంగణాన్ని టిడిపి వేదికగా ఉపయోగించుకొంటుంది.ఈ విషయమై ఈ యూనివర్శిటీని ఉపయోగించుకొనే విషయమై దయ్యాల కొంపగా అభివర్ణించారు ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి.

అయితే ఈ వ్యాఖ్యలపై యూనివర్శిటీ విద్యార్థులు విశాఖపట్టణంలో రాస్తారోకో చేశారు. 24 గంటలలోపుగా మూర్తి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. లేకపోతే మహానాడును అడ్డుకొంటామని విద్యార్థులు హెచ్చరించారు.

protest against MLC MVVS Murthy in Vishakapatnam

తనకున్న విద్యాసంస్థను ప్రమోట్ చేసుకొనేందుకుగాను ఎమ్మెల్సీ మూర్తి ఆంధ్రాయూనివర్శిటీని దయ్యాలకొంపగా అభివర్ణించారని విద్యార్థులు ఆరోపణలు చేశారు.

అయితే ఈ వ్యాఖ్యలను మంత్రి గంటా శ్రీనివాసరావు కూడ తప్పుబట్టారు. ఆంధ్రా యూనివర్శిటీకి గొప్ప చరిత్ర ఉందని మంత్రి గంటా గుర్తుచేశారు. ఏ ఉద్దేశ్యంతో మూర్తి ఈ వ్యాఖ్యలు చేశారో తనకు తెలియదన్నారు. అయితే ఈ వ్యాఖ్యలు సరికాదని ఆయన తప్పుబట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+