డిసెంబర్ 8న పులిచింతల జాతికి అంకితం: పార్థసారథి
విజయవాడ: కృష్ణా నదిపై నిర్మించిన పులిచింతల ప్రాజెక్టును వచ్చేనెల 8న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జాతికి అంకితం చేస్తారని మంత్రి పార్థసారథి ప్రకటించారు. శనివారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు.
కృష్ణా జలాలపై బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పు వల్ల రాష్ట్రానికి అన్యాయం జరిగిందని, పులిచింతల ప్రాజెక్టు నిర్మాణంతో కృష్ణా డెల్టా రైతులకు కొంత ఉపశమనం లభిస్తుందన్నారు.ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని కంచికచర్ల లేదా గన్నవరం ప్రాంతానికి తరలించనున్నట్లు మంత్రి చెప్పారు.

విజయవాడలో రూ.123 కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి అనుమతి లభించిందని, ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నుంచి అనుమతులు వచ్చాయన్నారు. వచ్చే నెల 8న ఆస్పత్రి శంకుస్థాపన జరుగుతుందని మంత్రి చెప్పారు.
వచ్చే నెల 3వ తేదీన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరగనుంది. రాష్ట్ర శాసనసభా సమావేశాల తేదీలను ఈ మంత్రి వర్గ సమావేశంలో ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగానే పులిచింతల ప్రాజెక్టును జాతికి అంకితం చేయాలని ముఖ్యమంత్రి అనుకుంటున్నారు.












Click it and Unblock the Notifications