జగన్‌పార్టీపై మండిపడ్డ పురంధేశ్వరి, బాబు ఇంటికి పవన్
హైదరాబాద్/కడప: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పైన మాజీ కేంద్రమంత్రి, భారతీయ జనతా పార్టీ రాజంపేట లోకసభ అభ్యర్థి పురంధేశ్వరి మండిపడ్డారు. గురువారం ఆమె కడప జిల్లా రాజంపేటలో గాయపడ్డ టిడిపి, బిజెపి కార్యకర్తలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.
వైయస్సార్ కాంగ్రెసు దాడులకు వెరవకుండా నిలబడిన టిడిపి, బిజెపి కార్యకర్తలకు ఆమె అభినందనలు తెలిపారు. జగన్ పార్టీ అక్రమాలకు తెగబడిందన్నారు. ఎన్నికల్లో తమకు మద్దతుగా నిలబడిన కార్యకర్తలకు తాము అండగా ఉంటామన్నారు. తమకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

తెలుగునాడు అని లగడపాటి డిమాండ్
కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలుగునాడుగా పేరు మార్చాలని లగడపాటి రాజగోపాల్ అన్నారు. దీని కోసం అసెంబ్లీలో కొత్త ప్రభుత్వం తీర్మానం చేయాలన్నారు. కొత్తగా ఏర్పడనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.10 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉంటున్న నేపథ్యంలో కొత్త ప్రభుత్వం కేంద్రం నుంచి నిధులు రాబట్టి రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలన్నారు. హైదరాబాదులో ఉన్న రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంలో పని చేయాలని, ఈ ఎన్నికల్లో గెలుపొందిన పార్టీ కొత్త రాష్ట్రంలోనే ప్రమాణస్వీకారం చేయాలన్నారు.
బాబు నివాసానికి పవన్ కళ్యాణ్
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నివాసానికి గురువారం మధ్యాహ్నం చేరుకున్నారు. ఆయనను చంద్రబాబు విందుకు ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన లంచ్ కోసం బాబు ఇంటికి వచ్చారు.












Click it and Unblock the Notifications