పిచ్చాసుపత్రినుండి పరారైన ఖురేషీ అరెస్ట్, భార్య పాత్రపై
హైదరాబాద్: ఇరవై రోజుల క్రితం హైదరాబాదులోని ఎర్రగడ్డ మానసిక వైద్యశాల నుండి తప్పించుకుపోయిన కరడుగట్టిన నేరస్తుడు ఖురేషీని పోలీసులు అరెస్టు చేశారు. ఖురేషీ తన మానసిక ప్రవర్తన సరిగా లేదన్నట్లుగా నటించి జైలు సిబ్బందిని తప్పుదోవ పట్టించాడు.
హైదరాబాదు వెస్ట్‌జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఖురేషీని అజ్మీరా దర్గా వద్ద అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అతనిని హైదరాబాదుకు తరలిస్తున్నారు. జైలులో ఉన్నప్పుడు తన మానసిక ప్రవర్తన బాగా లేదని తప్పుదోవ పట్టించి మానసిక వైద్యశాలలో చేరి, అక్కడి నుండి పారిపోయినట్లుగా తెలుస్తోంది. అతను భార్యతో సహా ముంబైకి పారిపోయాడు. దీంతో ఇందులో భార్య పాత్ర ఉందా అనే కోణంలోను పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

కాగా, ఎర్రగడ్డ మానసిక వైద్యశాల నుండి డిసెంబర్ 2న రాత్రి పదకొండు మంది అండర్ ట్రయల్ ఖైదీలు తప్పించుకున్న విషయం తెలిసిందే. అందులో ఖురేషీ కూడా ఉన్నాడు. ఆసుపత్రిలో తన భార్యతో ములాఖత్‌కు అనుమతి ఇవ్వలేదని ఖురేషీ పరారయ్యాడు. అతను ముంబైకి పారిపోతున్నట్లుగా అప్పుడే పోలీసులు అనుమానించారు. పరారైన రోగులు వివిధ జైళ్ల నుండి వచ్చిన వారు.
వెనుక భాగం నుండి వారు పరారయయారు. అండర్ ట్రయల్ ఖైదీలు తప్పించుకొని పారిపోవడంతో ఆసుపత్రి వర్గాలు అప్పుడు పోలీసులకు సమాచారాన్ని అందించాయి. నగరమంతా రెడ్ అలర్డ్ ప్రకటించారు. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లలో ప్రత్యేక నిఘా పెట్టారు. చెక్ పోస్టులలో తనిఖీలు చేస్తున్నారు. అప్పుడే కొందర్ని పట్టుకున్నప్పటికీ ఖురేషీ పారిపోయాడు. ఇప్పుడు అతనిని పట్టుకున్నారు.












Click it and Unblock the Notifications