కత్తెర వేయడానికే: ఆధార్ లింక్‌పై రఘువీరా
విజయవాడ: సంక్షేమ పథకాలకు ఆధార్‌తో లింకు పెట్టడం సరికాదని ఆంధ్రప్రదేశ్ పిసిిస అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. తక్షణమే లింక్‌ను రద్దు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాలను అతిక్రమించడమేనని రఘువీరారెడ్డి అన్నారు.
సంక్షేమ పథకాలకు కత్తెర వేయాలన్న ప్రభుత్వ తీరును ఎండగడతామని రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం విజయవాడలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో రఘువీరారెడ్డి ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు.

సంక్షేమ పథకాలకు ఆథార్ లింక్ పెట్టడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని ఆయన చెప్పారు. దీనిని వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గత పదేళ్లుగా మేం ఎవరికైతే సంక్షేమపథకాలు అందిస్తున్నామో ఇప్పుడు కూడా అర్హులైన వారందరికి సంక్షేమ పథకాలు కొనసాగించాలని రఘువీరారెడ్డి డిమాంద్ చేశారు.












Click it and Unblock the Notifications