వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్ర‌బాబు తో బాబా రాందేవ్ భేటీ : మెగా ఫుడ్ పార్క్ కు 172 ఎక‌రాలు..

|
Google Oneindia TeluguNews

ఏపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తో యోగా గురు బాబా రాందేవ్ భేటీ అయ్యారు. ఏపిలో త‌మ ప్రాజెక్టు అంశం పై సీయం తో చ‌ర్చించారు. గ‌తంలోనే ఏపిలో మెగా ఫుడ్ పార్క్ ఏర్పాటుకు బాబా రాందేవ్ ముందుకొచ్చారు. విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు నిర్ణ‌యించారు. ఇప్ప‌టికే ఏపి ప్ర‌భుత్వం ఈ సంస్థ కోసం 172.84 ఎక‌రాల భూమి కేటాయించింది.

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తో యోగా గురు బాబా రాందేవ్ స‌చివాల‌యంలో భేటీ అయ్యారు. విజయనగరం జిల్లా చిన్నరావుపల్లిలో పతంజలి సంస్థ ఏర్పాటు చేసే 'మెగా ఫుడ్‌ పార్క్‌'పై సీఎంతో ఆయన చర్చించారు. మెగాఫుడ్‌ పార్క్‌ గురించి చంద్రబాబుకు రాందేవ్‌ వివరించారు. రూ.634 కోట్ల వ్యయంతో ఆహారశుద్ధితో పాటు అనుబంధ యూనిట్లు ఏర్పాటు చేస్తామని సీఎంకు వివ‌రించారు. ఈ పార్క్‌తో 33,400 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. దీంతో... ఈ మెగాఫుడ్‌ పార్క్‌కు 172.84 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు రాష్ట్రంలో పెట్టుబడి లేని వ్యవసాయాన్ని ప్రోత్సహం కోసం అమ‌లు చేస్తున్న విధానాల ను వివ‌రించారు.

Ramdev Baba met C.m Chandrabau : Discussions on Mega Food Park..
English summary
Ram Dev Baba met AP C.M Chandrababu in Secretariat. Ram dev explained C.m about mega food park in Vizianagaram dist. Govt allocated 172.84 acres for this project.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X