ఎట్టకేలకు 21ఏళ్ల తర్వాత!: రేప్ నిందితుడిని పట్టుకున్న పోలీసులు..

20 ఏళ్ల క్రితం ఏఎన్‌ఎం శిక్షణ పొందేందుకు తుళ్లూరు మండలంలోని దొండపాడుకు కొంతమంది యువతులు వచ్చారు. అక్కడ యువతులకు శిక్షణ ఇచ్చే ఓ ట్రైనర్ తమ్ముడు కుందూరి నరసింహారావు అప్పుడప్పుడు అక్కడికి వచ్చేవాడు.అలా

తుళ్లూరు: రెండు దశాబ్దాల క్రితం జరిగిన ఓ అత్యాచార ఘటనకు సంబంధించి ఎట్టకేలకు పోలీసులు ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు.చిత్తూరు జిల్లా తుళ్లూరులో అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. 20 ఏళ్ల క్రితం ఏఎన్‌ఎం శిక్షణ పొందేందుకు తుళ్లూరు మండలంలోని దొండపాడుకు కొంతమంది యువతులు వచ్చారు. అక్కడ యువతులకు శిక్షణ ఇచ్చే ఓ ట్రైనర్ తమ్ముడు కుందూరి నరసింహారావు అప్పుడప్పుడు అక్కడికి వచ్చేవాడు.

rape accused arrested after 21years

అలా శిక్షణకు వచ్చిన ఓ యువతిని ప్రేమిస్తున్నట్టు నమ్మించి తనతో పాటు వేరే ప్రాంతానికి తీసుకెళ్లాడు. దీనిపై యువతి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. పోలీసులు శిక్షకురాలి(ట్రైనర్)ను విచారించగా.. ఆమె, మరో ఏడుగురి సహాయంతో నరసింహారావు యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని తేలింది.

శిక్షకురాలి సమాచారంతో నిందితుడి కోసం గాలించగా.. అతని ఆచూకీ ఎక్కడా దొరకలేదు. దీంతో కేసులో నిందితులుగా ఉన్న మిగతావారిని అరెస్ట్ చేశారు. వారిలో ఏడుగురు చనిపోవడం గమనార్హం. రెండు రోజుల క్రితం అనూహ్యంగా నరసింహారావు తుళ్లూరు పోలీసులకు చిక్కాడు.

అతన్ని కోర్టు ముందు హాజరుపరచగా.. జడ్జి 15 రోజుల రిమాండ్‌ విధించారు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ చూపిన తుళ్లూరు కానిస్టేబుళ్లు తోటా ఏడుకోండలు, శ్రీనివారావును సీఐ అభినందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+