4ఏళ్ల బాలికపై రేప్‌యత్నం, చికిత్స పొందుతూ మృతి
కడప/మహబూబ్ నగర్: కడప జిల్లాలోని రైల్వేకోడూరు మండలం శాంతినగర్‌లో దారుణం జరిగింది. నాలుగేళ్ల బాలిక పైన ఓ యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. రెండు రోజుల క్రితం ఈ సంఘటన జరిగింది. బాలిక తీవ్ర అస్వస్థతకు గురవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు.
రెండు రోజులుగా చిత్తూరు జిల్లాలోని తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలిక గురువారం ఉదయం మృతి చెందింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ప్రమాదంలో ఇద్దరు మృతి
మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్ క్రాస్ రోడ్డు వద్ద ఈ ఉదయం గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు మృతి చెందారు. మృతులు మానవపాడు మండలం ఉండవల్లి గ్రామస్థులు గుర్తించారు.
బైక్, ట్యాంకర్ ఢీ
మహబూ బ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం రంగారెడ్డిగూడ సమీపంలో జాతీయ రహదారి పైన గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. హైదరాబాద్ బంజారాహిల్స్‌కు చెందిన కిరణ్, అనిల్ బైక్ పైన మహబూబ్ నగర్ వెళ్తుండగా ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కిరణ్ మృతి చెందాడు. అనిల్‌కు గాయాలయ్యాయి.












Click it and Unblock the Notifications