కెసిఆర్ ప్రాంతీయ ఉగ్రవాది, జగన్‌తో మిలాఖత్: ఏకేసిన రావెల

ఒంగోలు: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును ఆంధ్రప్రదేశ్ మంత్రి రావెల కిశోర్ బాబు ప్రాంతీయ ఉగ్రవాదిగా అభివర్ణించారు. ఆంధ్రావాళ్లు వెళ్లిపోతే వాళ్ల అస్తులన్నీ వస్తాయని తెలంగాణ ప్రజలను రెచ్చగొడుతున్న ప్రాంతీయ ఉగ్రవాది కెసిఆర్ అని ఆయన అన్నారు. ఆంద్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం (ఎపిజెఎఫ్) ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన విభజన చట్టం సెక్షన్ అమలుపై జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

రవాణా, రహదారులు భవనానల శాఖ మంత్రి శిద్ధా రాఘవురావు, ఎన్జీవో సంఘం రాష్ట్రాధ్యక్షుడు అశోక్ బాబు, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ తదితరులు ఈ సభకు హాజరయ్యారు. చంద్రబాబుపై కెసిఆర్ కుట్ర చేసి రాజకీయ అస్థిరతను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని రావెల కిశోర్ బాబు ఆరోపించారు.

Ravela terms KCR as regional terrorist

రాష్ట్ర విభజనకు గుండెకాయ వంటి సెక్షన్ 8ను అడ్డుకోవాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. కెసిఆర్‌తో చేతులు కలిపిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తు్నారని ఆనయ అన్నారు. హైదరాబాదుపై తమకు ఇంకా తొమ్మిదేళ్లు హక్కు ఉందని శిద్ధా రాఘవరావు అన్నారు.

రెండు రాష్ట్రాలను నియంత్రించాల్సిన బాధ్యత ఉన్న గవర్నర్ చోద్యం చూడడానికే పరిమితమవుతున్నారని ఆయన అననారు. స్వయంగా కెసిఆరే ఆంధ్రవాళ్లను పారదోలండని పిలుపునిస్తున్నారని, దాంతో పరిస్థితి తీవ్రమవుతుందని పి. అశోక్ బాబు అన్నారు ఎమ్మెల్సీ మాగుంట, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+