29 కేంద్రాల్లో రీపోలింగ్: తెలంగాణలో 12, సీమాంధ్రలో 17

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) 29 కేంద్రాల్లో ఈ నెల 13వ తేదీన రీపోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. ఏప్రిల్ 30, మే 7న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలు మొరాయించిన చోట, ధ్వంసమైన చోట రీపోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు ఈ నెల 13న 29 పోలింగ్ కేంద్రాల్లో మళ్లీ పోలింగ్ నిర్వహించనున్నారు.

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ పంపిన నివేదికను సమీక్షించిన కేంద్ర ఎన్నికల సంఘం 29 చోట్ల రీపోలింగ్ జరపాలని ఆదేశించింది. దీంతో 13న ఆయా కేంద్రాల్లో రీపోలింగ్‌కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ తెలిపారు. తెలంగాణలో మొత్తం 12 కేంద్రాల్లో, సీమాంధ్రలో మొత్తం 17 కేంద్రాల్లో రీపోలింగ్ జరగనుంది.

Re poll ordered in 29 polling stations

తెలంగాణలో...

పార్లమెంటు: నిజామాబాద్ లోకసభ పరిధిలోని బోధన్‌లో 64వ పోలింగ్ కేంద్రం, జహీరాబాద్ లోకసభ పరిధిలోని జుక్కల్‌లో 134వ పోలింగ్ కేంద్రం, బాన్సువాడలోని 39, 187 పోలింగ్ కేంద్రాలు. నిజామాబాద్ రూరల్‌లోని 9వ నెంబర్ పోలింగ్ కేంద్రం, కరీంనగర్ లోకసభ పరిధిలోని హుస్నాబాద్‌లో 170వ పోలింగ్ కేంద్రం.

అసెంబ్లీ: బాన్సువాడలో 146వ పోలింగ్ కేంద్రం, నిజామాబాద్ రూరల్‌లోని 48, 168 పోలింగ్ కేంద్రాలు, కూకట్‌పల్లిలోని 371/ఎ పోలింగ్ కేంద్రం, కొత్తగూడెంలో 161 పోలింగ్ కేంద్రం, భద్రాచలంలో 239 పోలింగ్ కేంద్రం.

సీమాంధ్రలో...

పార్లమెంటు: శ్రీకాకుళం లోకసభ పరిధిలోని శ్రీకాకుళంలో46వ పోలింగ్ కేంద్రం, మచిలీపట్నం లోకసభ పరిధిలోని గుడివాడలో 123వ కేంద్రం, అవనిగడ్డలోని 29వ కేంద్రం, విజయవాడ లోకసభ పరిధిలోని విజయవాడ తూర్పులో 212 వ పోలింగ్ కేంద్రం, మైలవరంలో 123 పోలింగ్ కేంద్రం, జగ్గయ్యపేటలోని 122వ పోలింగ్ కేంద్రం.

అసెంబ్లీ: కుప్పంలోని 192 పోలింగ్ కేంద్రం, సాలూరులోని 134వ పోలింగ్ కేంద్రం, అవనిగడ్డలోని 91వ పోలింగ్ కేంద్రం, పెనమలూరులోని 59, 172 పోలింగ్ కేంద్రాలు, నందిగామలో 171, 174 పోలింగ్ కేంద్రాలు.

కాగా, పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకు రెండింటికి పోలింగ్ జరగనున్న కేంద్రాల్లో... అరకు లోకసభ పరిధిలోని పాడేరులో 68వ పోలింగ్ కేంద్రం, కడప లోకసభ పరిధిలోని జమ్మలమడుగులో 80, 81,82 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+