బాబును పొగిడిన రేవంత్, ధీటుగా కేసీఆర్, గందరగోళం
హైదరాబాద్: తెలంగాణ శాసన సభలో తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ధీటుగా స్పందించారు. అదే సమయంలో సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు కితాబిచ్చారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతుండగా సభలో కొంత గందరగోళం చెలరేగింది.
రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్రం రావడం ఎంత నిజమో.. తెలంగాణలో విద్యుత్ సమస్య ఉన్నదన్నది అంతే నిజమని అన్నారు. న్యాయంగా మనకు రావాల్సిన విద్యుత్ తెచ్చుకుందామని ఎర్రబెల్లి దయాకర రావు నాయకత్వంలో తాము పదేపదే చెప్పాని, దీనిని ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.
అయితే, ఆలస్యంగానైనా ముఖ్యమంత్రి విద్యుత్ విషయంలో నిర్ణయం తీసుకున్నందుకు అభినందిస్తున్నానని చెప్పారు. విద్యుత్ విషయంలో టీడీపీ ప్రభుత్వాన్ని తప్పు పట్టే కేసీఆర్.. నాడు మంత్రిగా కూడా ఉన్నారన్నారు. ఆయన భాగస్వామ్యాన్ని కూడా తీసుకోవాలన్నారు.

విద్యుత్ విషయంలో చంద్రబాబు దూరదృష్టితో ఆలోచించి సరళీకృత విధానాలు తీసుకు వచ్చారన్నారు. హైదరాబాదుకు నిరంతర విద్యుత్ అందించిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదే అన్నారు. విద్యుత్ సమస్య పరిష్కారానికి అందరు కృషి చేయాలన్నారు. సభలో వాస్తవాలు వెల్లడిస్తే తాము సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. విద్యుత్ ఉత్పాదనలో చంద్రబాబు సమైక్య ఆంధ్ర రాష్ట్రాన్ని నాలుగో స్థానంలో నిలబెట్టారన్నారు.
రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే.. తెరాస సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. వారు ఏదో మాట్లాడుతారట మాట్లాడనివ్వాలన్నారు. అనంతరం సభాపతి వారికి మైక్ ఇవ్వలేదు. రేవంత్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. విద్యుత్ సమస్య పైన బేషజాలకు పోకుండా నిజాలు సభ ముందు పెట్టాలన్నారు. అప్పుడు ట్రాన్స్ కోలు, జెన్కోలు లేవన్నారు. బాబు ముందు చూపుతో వ్యవహరించారన్నారు.
రేవంత్ వ్యాఖ్యల పైన కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. రేవంత్ సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. సమస్యను పక్కదారి పట్టించవద్దన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలన్నారు. దానికి రేవంత్ స్పందిస్తూ.. తాను సంబంధం లేని అంశాలు మాట్లాడనని చెప్పారు.
అధికారులతో పని చేయించుకోలేని అసమర్థ ప్రభుత్వం అని రేవంత్ రెడ్డి అన్నారు. తమది అసమర్థత కాదని, చాలామార్లు అధికారుల కోసం కేంద్రానికి లేఖ రాశామని కేసీఆర్ చెప్పారు. ఈ సమయంలో కేసీఆర్ మాట్లాడుతూ.. ఈ రోజు బ్లాక్ డే అని, రేవంత్ మాతృభూమికి ద్రోహం చేస్తున్నారన్నారు. ఇతర ప్రభుత్వాలను సమర్థిస్తున్నారన్నారు. ఏపి చేసిన ద్రోహాన్ని ఆయన సమర్థించడం ఏమిటన్నారు.
పుట్టిన గడ్డకు ద్రోహం చేయడమేమిటన్నారు. వీరు పక్క రాష్ట్రాన్ని సమర్థిస్తున్నారా లేక తెలంగాణ కోసం మాట్లాడుతున్నారా అని ప్రశ్నించారు. ఇలా మాట్లాడటం చరిత్రలో వంద శాతం తప్పన్నారు. రేవంత్ మాట్లాడే ఒక్క మాట సరైనది కాదన్నారు. ఇంత దుర్మార్గంగా ఎలా మాట్లాడుతారన్నారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్..












Click it and Unblock the Notifications