లారీ ఢీ: సహోద్యోగి పెళ్లికి వెళ్తున్న ఇద్దరు టెక్కీలు మృతి

కడప:నగర శివారులో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయాలపాలయ్యారు.

ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. మహారాష్ట్రకు చెందిన ప్రతీక్‌, హైదరాబాద్‌కు చెందిన అమృతరావు, రాజమహేంద్రవరానికి చెందిన సత్యనాగమణి, తిరుపతికి చెందిన సంతోష్‌కుమార్‌లు బెంగళూరులోని ఓ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు.

Road accident in Kadapa: two techies killed

కాగా, వీరి స్నేహితుడైన విద్యాసాగర్‌ వివాహానికి హాజరయ్యేందుకు కడపకు వస్తున్నారు. మరో 10 నిమిషాల్లో పెళ్లి మండపానికి చేరుకుంటారనగా.. వీరు ప్రయాణిస్తున్న కారును వేగంగా వచ్చిన ఓ లారీ ఢీకొంది. దీంతో కారు పూర్తిగా నుజ్జునుజ్జైంది.

ఈ ప్రమాదంలో ప్రతీక్‌ అక్కడికక్కడే మృతిచెందగా.. అమృతరావు రిమ్స్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. సత్యనాగమణి, సంతోష్‌కుమార్‌ తీవ్రంగా గాయపడటంతో వారిని ఆస్పత్రికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+