పోలీసులమని చెప్పి నవజీవన్ రైలులో దోపిడీ
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జల్లా నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో గురువారంనాడు రూ. 82 లక్షల దోపిడీ జరిగింది. చెన్నైలో బంగారం కొనడానికి వెళుతుండగా ఈ చోరీ జరిగింది. వ్యాపారులు సునీల్, రామయ్యను విచారణ పేరుతో పడుగుపాడు దగ్గర కొందరు దుండగులు పోలీసులమని చెప్పి రైలు నుంచి కిందికి దించేశారు. వారిని కారులో తీసుకువెళ్లి నగదు కాజేసీ అనంతరం దగదర్తి దగ్గర కిందికి తోసేశారు.
దీంతో బాధితులు కావలి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. గురువారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగులను పట్టుకునేందుకు దర్యాప్తు చేపట్టారు. దుండగులు ప్రకాశం జిల్లా చెవూరు తోటవద్ద కారును వదిలి పరారయ్యారు. పోలీసులు కారును స్వాధీనం చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది.

ఈ దోపిడీ కేసును పోలీసులు ఛాలెంజ్‌గా తీసుకుని దర్యాప్తు ముమ్మరం చేసి దోపీడీ జరిగిన కొద్ది గంటలలోనే కేసును ఛేధించారు. కనిగిరి మండలం, చింతలపాలెం దగ్గర దోపిడీ దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ. 82 లక్షల నగదు, రెండు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు.
ముగ్గురిని అదుపులోకి తీసుకోగా, మరొకరు పరారీలో ఉన్నాడు. దొంగల కదలికలపై ట్యాక్సీ డ్రైవర్లకు పోలీసులు సమాచారం అందించారు. టాక్సీ డ్రైవర్ల సాయంతోనే పోలీసులు దొంగలను పట్టుకున్నారు.












Click it and Unblock the Notifications