తిరుపతిలో ఎమ్మెల్యే రోజా ధర్నా
తిరుపతి: చిత్తూరు జిల్లా నుంచి మన్నవరం విద్యుత్ ప్రాజెక్టు పక్క రాష్ట్రాలకు తరలిపోతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు కనీసం స్పందించడం లేదని, ఆయనకు రాయలసీమ ప్రాంతం పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏపాటితో అర్ధం అవుతుందని వైసీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు.
తిరుపతిలో వైసీపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వం మన్నవరం ప్రాజెక్టుపై వ్యవహరిస్తోన్న తీరుతో పాటు ప్రజా వ్యతిరేక విధానాలపై వైసీపీ ఎమ్మెల్సీ శ్రీనివాసులు రెడ్డి నిరాహార దీక్ష చేపట్టారు. ఈ నిరాహార దీక్ష స్థలి వద్దకు చేరుకుని సంఘీభావం ప్రకటించారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు. ఏపీ నుంచి మన్నవరంలోని భెల్ ప్రాజెక్ట్ మరో రాష్ట్రానికి తరలిపోతున్న చంద్రబాబుకు చీమకుట్టినట్లు కూడా లేదని ఆమె విమర్శించారు. మన్నవరం ప్రాజెక్టుకు అరిష్టం పట్టుకుందని, ఈ ప్రాజెక్టు ఇంత వరకు ముందుకు కదల్లేదంటే చాలా దారుణమైన విషయమని ధ్వజమెత్తారు.
ఇది 6వేల కోట్లతో పెట్టే ప్రాజెక్టు అని, ప్రత్యక్షంగా ఆరు వేల మందికి, పరోక్షంగా మరో ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications