'అనిత కాళ్లు పట్టుకొని రోజా క్షమాపణ చెప్పాల్సిందే, అటెండర్ కూడా..'

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే వంగలపూడి అనిత కాళ్లు పట్టుకొని క్షమాపణ చెప్పిన తర్వాతే అసెంబ్లీకి రావాలని టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు ఆదివారం

విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే వంగలపూడి అనిత కాళ్లు పట్టుకొని క్షమాపణ చెప్పిన తర్వాతే అసెంబ్లీకి రావాలని టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు ఆదివారం అన్నారు.

రోజాకు అసెంబ్లీలో కనీసం అటెండర్ కూడా భయపడడని విమర్శించారు. రేపు (సోమవారం) ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

ఈ నేపథ్యంలో రోజాను అసెంబ్లీకి అనుమతిస్తారా లేదా అనే చర్చ సాగుతోంది. ఆమె క్షమాపణ చెబితేనే అసెంబ్లీకి రానిచ్చే పరిస్థితులు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. దీనిపై బోండా ఉమ స్పందించారు.

Roja should say apology to MLA Anitha

కాగా, రోజా సస్పెన్షన్‌ వ్యవహారంపై శాసనసభ మంగళవారం ఏడో తేదీన నిర్ణయం తీసుకోనుంది. సోమవారం బడ్జెట్‌ సమావేశాల తొలి రోజున గవర్నర్‌ ప్రసంగం కార్యక్రమానికి ఆమెను అనుమతించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఆ తర్వాత ఆమెను సమావేశాలకు అనుమతించాలా? లేదా? అన్న అంశంపై మంగళవారం స్పష్టత వస్తుంది. శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు, టిడిపి శాసన సభ్యురాలు అనితలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని రోజాపై హక్కుల కమిటీకి అధికారపక్షం ఫిర్యాదు చేసింది.

ఈ రెండింటినీ శాసనసభ్యుడు గొల్లపల్లి సూర్యారావు సారధ్యంలోని శాసనసభ హక్కుల కమిటీ వేర్వేరు అంశాలుగా పరిగణనలోకి తీసుకుంది. ముఖ్యమంత్రిపై రోజా చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఆమెను ఏడాదిపాటు సభ నుంచి సస్పెండ్‌ చేశారు. ఆ గడువు 2016 డిసెంబరుతో ముగిసింది.

అనిత ఇచ్చిన ఫిర్యాదుపై విచారించిన హక్కుల కమిటీ మరో ఏడాది సస్పెన్షన్‌కు సిఫారసు చేసింది. దీనిపై తాను సభకు వచ్చి క్షమాపణ చెబుతానని శాసనసభాపతికి రోజా లేఖ అందజేశారు. మంగళవారం రోజా సభకు వచ్చి క్షమాపణ చెబితే ఆమెపై సస్పెన్షన్‌ తొలగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

అసెంబ్లీ సమావేశాలకు ఏర్పాట్లు పూర్తి

బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో సభ ఆవరణలోకి, సభలోకి ఎవరు ఎలా ప్రవేశించాలన్న అంశంపై స్పీకర్ ఆదేశాల మేరకు పోలీసులు ఏర్పాట్లు చేశారు. శాసనసభ్యులు, మండలి సభ్యుల వాహనాల పార్కింగ్‌కు జిల్లాలవారీగా ప్రత్యేక ఏర్పాట్లున్నాయి.

గేట్ -1, ప్రవేశం-1: ముఖ్యమంత్రి వచ్చే మార్గాలు. గేట్-1, ప్రవేశం-6: స్పీకర్‌, కౌన్సిల్‌ ఛైర్మన్‌. గేట్-2 ప్రవేశం-8: మంత్రులు, కేబినెట్‌ ర్యాంకు ఉన్నవారు, ప్రతిపక్ష నేత. గేట్-4: ఎమ్మెల్యేలు (ప్రవేశమార్గం 8 నుంచి), ఎమ్మెల్సీలు (ప్రవేశం- 3, 4నుంచి) వస్తారు. గేట్-3: మీడియా (ప్రవేశమార్గం 9), వీఐపీ, అధికారులు (ప్రవేశమార్గం 7). గేట్-5: శాసనసభ సిబ్బంది, ఐఏఎస్‌లు (ప్రవేశమార్గం 5).

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+