దారుణం: ముఖంపై యాసిడ్ పోసి, నోట్లో గుడ్డలు కుక్కి కొట్టి చంపారు
అమరావతి: తిరుపతిలో ఓ రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. నగరంలోని సిద్దారెడ్డినగర్‌లో నివాసం ఉంటున్న రౌడీషీటర్ శ్రీనివాసరెడ్డిని గుర్తు తెలియని దుండగులు అర్థరాత్రి అత్యంత దారుణంగా హత్య చేశారు.
ముఖంపై యాసిడ్ పోసి, నోట్లో గుడ్డలు కుక్కి మరీ కొట్టి చంపిన ఆనవాళ్లు ఉన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వివిధ నేరాలకు సంబంధించి పలు కేసులు అతనిపై ఉన్నాయని తెలిపారు.
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

వెళ్తున్న బస్సులోంచి దూకి ఆత్మహత్య
బస్సులో నుంచి కిందికి దూకి ఓ వ్యక్తి ప్రాణం తీసుకున్న ఘటన శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో మంగళవారం చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా కందుకూరు మండలం జరుగుమల్లి గ్రామానికి చెందిన సుబ్బారెడ్డి(35) బెంగళూరు కృష్ణరాజపురంలో టీ దుకాణం నడుపుకుంటూ జీవిస్తున్నాడు.
అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. గత కొంతకాలంగా అతడు మద్యానికి బానిసయ్యాడు. ఒంగోలులోని పోలేరమ్మ గుడిలో ఇచ్చే తాయెత్తు కట్టుకుంటే మద్యం మానేయవచ్చనే కుటుంబ సభ్యుల సలహా మేరకు స్నేహితుడు మునిరాజాతో కలసి సోమవారం రాత్రి బెంగళూరు నుంచి బయలుదేరాడు.
వారిద్దరూ ప్రయాణిస్తున్న బస్సు నెల్లూరు జిల్లా గూడూరు జాతీయరహదారిపై పంటలేరు బ్రిడ్జి వద్దకు రాగానే అకస్మాత్తుగా తన సీట్లోంచి లేచి, బస్సు డోరు తీసుకుని బయటకు దూకేశాడు. దీంతో తలకు తీవ్రగాయాలు కావటంతో సుబ్బారెడ్డి అక్కడికక్కడే మరణించాడు.
దీంతో సమాచారం అందుకున్న గూడూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్ధానికి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు మునిరాజాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications