వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోనసిమ అల్లర్ల వెనుక కుట్ర- సొంతనేతలపై దాడులు చేయించుకుంటామా ? సజ్జల కామెంట్స్

|
Google Oneindia TeluguNews

కోనసీమలో నిన్న జరిగిన ఘర్షణలు, వైసీపీ మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లపై జరిగిన దాడులపై విపక్షాలు చేస్తున్న విమర్శళపై ఇవాళ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా స్పందించారు. ప్రతిపక్షాల విమర్శలు చూస్తుంటే వారే దాడులు చేయించారన్న అనుమానం కలుగుతోందన్నారు. టీడీపీ, జనసేనవి దుర్మార్గపు రాజకీయ ఆరోపణలని ఆయన విమర్శించారు. ఇలాంటి అడ్డగోలు ఆరోపణల్ని వారి విజ్ఞతకేే వదిలేస్తున్నామన్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వి అవగాహన లేని ఆరోపణలని సజ్జల ఆరోపించారు. కడప జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టలేదనడం వింతడవాదమనన్నారు.

కోనసీమలో దాడులకు పాల్పడిన వారిలో ఒక్కొక్కరుగా బయటపడుతున్నారని సజ్జల అన్నారు. వీరిలో ఎవరినీ వదిలిపెట్టబోమన్నారు. అమలాపురంలో కుట్రపూరితంగా దాడులు చేశారని సజ్జల ఆరోపించారు. ఇదంతా ప్లానింగ్ ప్రకారమే జరిగిందన్నారు. జనసేనలో కిందిస్ధాయిలో ఉన్న వారు దాడుల్లో పాల్గొన్నట్లు తెలుస్తోందన్నారు. ఈ దాడుల్లో నిందితుడిగా భావిస్తూ పోలీసులు అరెస్టుచేసిన అన్యం సాయి తనతో పాటు విపక్ష నేతలతో ఇళ్లలోనే ఫొటోలు దిగాడని సజ్జల తెలిపారు.

sajjala ramakrishnareddy refute pawan kalyans allegations of self attacks in konaseema

నిన్నటి దాడుల్లో మంత్రి, ఎమ్మెల్యే తృటిలో తప్పించుకున్నారని సజ్జల తెలిపారు. తమ పార్టీ నేతలపై తామే దాడుు చేయించుకున్నాంటూ పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు హాస్యాస్పదమని సజ్జల విమర్శించారు. ఆరోపణలు చేసేముందు కనీసం ఆలోచించరా అని ప్రశ్నించారు. ఒకే ఆరోపణ అందరూ కోరస్ లా అందరూ వినిపిస్తున్నారని, టీడీపీ, పవన్ అంతా ఒకే ఆరోపణలు చేస్తున్నారని సజ్జల విమర్శించారు. మా మంత్రి, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడులు చేయించుకుని ఏం సాధిస్తామని విపక్షాలను ఆయన ప్రశ్నించారు.

English summary
ap govt advisor sajjala ramakrishna reddy on today refused pawan kalyan's allegations on konaseema violence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X