స్మార్ట్ సిటీ: కెసిఆర్‌తో మైక్రోసాఫ్ట్ సిఈఓ సత్య నాదెళ్ల
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుతో మైక్రోసాఫ్ట్ సిఈఓ సత్య నాదెళ్ల ఆదివారం సాయంత్రం భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ అభివృద్ధి కేంద్రం విస్తరణ, డాటా సెంటర్ ఏర్పాటు, స్మార్ట్ సిటీగా రూపాంతరం చెందనున్న హైదరాబాద్‌కు అవసరమైన సహకారం అందించాల్సిందిగా సత్య నాదెళ్లను సిఎం కేసీఆర్ కోరినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
సిఎం ప్రతిపాదనలపై ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపాయి. హైదరాబాద్‌ను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసే అంశంపై తమ వైపు నుంచి ఎలాంటి సహకారం కావాలో తెలపాల్సిందిగా తనతోపాటు కేసీఆర్‌ను కలిసిన భారతీయ నిపుణుల బృందాన్ని సత్య నాదెళ్ల కోరారు.

హైదరాబాద్‌కు మంజూరైన ఐటిఐఆర్ ప్రాజెక్టులో సింహభాగం మెక్రోసాఫ్ట్ భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నట్టు ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ భేటీలో తెలంగాణ రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కె తారకరామారావుతో పాటు తెలంగాణ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి ప్రదీప్ చంద్ర పాల్గొన్నారు.
మైక్రోసాఫ్ట్ సిఈవోగా నియమితుడైన తర్వాత సత్య నాదెళ్ల తొలిసారి హైదరాబాద్‌కు వచ్చారు. ఆయన ఏపీ సీఎం చంద్రబాబుతోనూ సమావేశమవుతారు. ఈ సందర్భంగా ఏపీలో మైక్రోసాఫ్ట్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా చంద్రబాబు సత్య నాదెళ్లను కోరే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications