‘బాబు పతనానికిదే నాంది-జగన్ అండ వెయ్యేనుగుల బలం’
పశ్చిమగోదావరి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అండ తనకు వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చిందని సోమవారం బెయిలుపై విడుదలైన ఆరేటి సత్యవతి అన్నారు. తుందుర్రు బాధితుల పరామర్శకు జగన్ రావడం తనకు ఎంతో బలాన్ని ఇచ్చిందన్నారు.
మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు ఓ మహిళను అక్రమంగా హత్యాయత్నం కేసులో ఇరికించిన ఘనత మూటకట్టుకున్నారని అన్నారు. చంద్రబాబు పతనానికి ఇదే నాంది అని ధ్వజమెత్తారు.
తాను ఇప్పటికే 50 రోజులు జైలులో ఉన్నానని, ఏడాది ఉంచినా తన ఉద్యమాన్ని ఆపబోనని తేల్చి చెప్పారు. గ్రామాలు కాలుష్య కోరల్లోకి చిక్కుకోకుండా ఆక్వాఫుడ్‌కు వ్యతిరేకంగా పోరాడతానని సత్యవతి స్పష్టం చేశారు.

'అక్టోబర్ 19వ తేదీన వైnస్ జగన్ నన్ను తణుకు సబ్‌జైలులో కలిసిన సందర్భంగా తమ్ముడికి (ఆరేటి సత్యవతి కొడుకు వాసు) నీతోపాటు మిగిలిన బాధితులకు నేను అండగా ఉంటానని చేతిలో చెయ్యేసి చెప్పడం ఉద్యమానికి మరింత బలం ఇచ్చింది' అన్నారు.
సెప్టెంబరు 20వ తేదీన తణుకు సబ్‌జైలుకు వచ్చిన సత్యవతి సోమవారం నరసాపురం కోర్టులో హాజరై ఆర్డర్ కాపీని తణుకు సబ్‌జైలులో సమర్పించారు. విడుదలైన సత్యవతిని అఖిలపక్షాల ఆధ్వర్యంలో పూల దండలు వేసి ఆహ్వానించారు












Click it and Unblock the Notifications