చిరంజీవికి చెప్తా, సమైక్యమే: గంటా, రాజ్యసభ రసవత్తరం

సమైక్య రాష్ట్రాన్ని కోరుకునే వ్యక్తిని తాము రాజ్యసభ బరిలో నిలబెడతామని చెప్పారు. కాంగ్రెసు పార్టీ విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నందున ఆ పార్టీ అభ్యర్థిని బలపర్చమని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా తాను ఏది చేసినా చిరంజీవికి చెబుతానని, ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకు వెళ్తానని చెప్పారు.
నేను బరిలో ఉన్నా: జెసి
తాను రాజ్యసభ బరిలో ఉన్నానని మాజీ మంత్రి, అనంతపురం జిల్లా సీనియర్ కాంగ్రెసు పార్టీ శాసన సభ్యులు జెసి దివాకర్ రెడ్డి చెప్పారు. తనను గెలిపించాల్సిందిగా గంటాతో పాటు ఇతర సీమాంధ్ర శాసన సభ్యులను కోరుతానని చెప్పారు. కాగా, గంటా నివాసంలో మంత్రులు టిజి వెంకటేష్, ఏరాసు ప్రతాప్ రెడ్డి, మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి సమావేశమయ్యారు. రాజ్యసభ ఎన్నికపై మంతనాలు జరుపుతున్నారు. మరోవైపు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మను మాజీ మంత్రి గాదె వెంకట రెడ్డి కలిశారు.
కాంగ్రెస్ రాజ్యసభ రసవత్తరం
రెబల్ అభ్యర్థులు బరిలోకి దిగుతుండటంతో అధికార కాంగ్రెసు పార్టీలో రాజ్యసభ పోరు రసవత్తరంగా మారుతోంది. తెలంగాణకు కాంగ్రెసు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంతో పలువురు సీమాంధ్ర కాంగ్రెసు నేతలు సమైక్యవాద అభ్యర్థిని పోటీగా నిలబెట్టేందుకు సిద్ధమయ్యారు.
ఆరు ఖాళీల్లో మూడు కాంగ్రెసుకు, రెండు టిడిపికి దక్కుతాయి. ఆరో స్థానంపై పోటీ లేదా ఇతర పార్టీల మద్దతుతో కాంగ్రెసు గెలుచుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఆరో స్థానంపై పోటీ ఏమో కానీ మిగిలిన వాటిలోను గందరగోళం ఏర్పడుతోంది. అధిష్టానాన్ని ధిక్కరిస్తు పలువురు రెబల్ అభ్యర్థిని బరిలోకి దించుతున్నారు. దీంతో మొదటి మూడింటిలోనే కాంగ్రెసు ఎన్ని గెలుచుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. లేదా బుజ్జగిస్తే రెబల్ వర్గం వెనక్కి తగ్గుతుందా ఆనేది చూడాలి.












Click it and Unblock the Notifications