సీమాంధ్రలో ఉద్రిక్తం: రాళ్ల దాడి, రక్తం కారింది (పిక్చర్స్)
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలలో భాగంగా బుధవారం సీమాంధ్రలో జరిగిన పోలింగ్ స్వల్ప ఉద్రిక్తతలకు దారి తీసింది. పలుచోట్ల తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు బాహాబాహీకి దిగాయి. జమ్మలమడుగులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు ఏఎస్పీ పైన దాడికి పాల్పడ్డారు.
గుంటూరు జిల్లా నర్సారావుపేటలో తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి రాయపాటి సాంబశివ రావు వాహనం పైన రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఆయన తృటిలో తప్పించుకున్నారు. ఈ ఘటనలో ఆయన కారు అద్దాలు పగిలిపోయాయి. పోలీసుల సహకారంతో ఆయన అక్కడి నుండి వెళ్లిపోయారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తిరుపతి అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డి పైన టిడిపి కార్యకర్తలు అతిగా ప్రవర్తించారట. భూమన పైన టిడిపి అభ్యర్థి వెంకటరమణ చేయి చేసుకున్నారని వైయస్సార్ కాంగ్రెసు ఆరోపిస్తోంది. ఈ ఘటనలో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. సీమాంధ్ర పోలింగులో స్వల్ప ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.

రాయపాటి
గుంటూరు జిల్లా నర్సారావుపేట లోకసభ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రాయపాటి సాంబశివ రావు పైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనలో పడిన రాళ్ల దృశ్యం.

రాయపాటి
గుంటూరు జిల్లా నర్సారావుపేట లోకసభ టిడిపి అభ్యర్థి రాయపాటి సాంబశివ రావు పైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు దాడి చేయడంతో పగిలిన కారు అద్దాలు.

రాయపాటి
గుంటూరు జిల్లా నర్సారావుపేట లోకసభ టిడిపి అభ్యర్థి రాయపాటి సాంబశివ రావు పైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు దాడి చేయడంతో.. పోలీసులు చెదరగొడుతున్న దృశ్యం. ఈ ఘటన బసికాపురంలో జరిగింది.

రక్తం కారింది
నరసరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్ రొంపిచర్ల మండలం రామిరెడ్డిపాలెంలో టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తల మధ్య బాహాబాహీ చోటు చేసుకుంది. దీంతో ఏఆర్ కానిస్టేబుల్ గాలిలోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపి పరిస్థితిని చక్కదిద్దారు.

పగిలిన అద్దాలు
వైయస్సార్ కాపెట్టని కోటగా ఉన్న ఈ గ్రామంలో టిడిపి పోలింగ్ ఏజెంట్‌ను ఏర్పాటు చేయటంతో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. ఈ గ్రామాన్ని ఎస్పీ సత్యనారాయణ సందర్శించారు. గాలిలోకి కాల్పులు జరిపిన ఏఆర్ కానిస్టేబుల్‌ను ఎస్పీ అభినందించి నగదు రివార్డు అందజేశారు.

చికిత్స
సీమాంధ్రలో పోలింగ్ ఉద్రిక్తతలకు దారి తీసింది. టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల మధ్య పలుచోట్ల రాళ్ల వర్షం కురిసింది. ఓ జిల్లాలో గాయపడ్డ వ్యక్తులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ...

ఇంటి పైకి రాళ్లు
ఒకప్పుడు బాంబుల గడ్డగా పేరొందిన జమ్మలమడుగులో పోలింగ్ సందర్భంగా ఉద్రిక్తతలు రాజ్యమేలాయి. ఇక్కడ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు పోలీసుల పైన దాడికి దిగారు. పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. ఓ ఇంటిలోకి రాళ్లు విసిరిన దృశ్యం.

పొద్దుటూరు
జమ్మలమడుగు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి, ఆయన సోదరుల ఆధిపత్యంలోని దేవగుడి గ్రామాల్లో పాతికేళ్లుగా పోలింగ్‌బూత్‌లలో టిడిపి ఏజెంట్లను కూర్చోబెట్టే పరిస్థితులు లేకుండెనని ఆ పార్టీ ఆరోపిస్తుంటోంది. ఈసారి బయటి గ్రామాలకు చెందిన వారిని ఏజెంట్లుగా కూర్చోబెట్టేందుకు టిడిపికి ఈసి అనుమతి లభించింది. కానీ, జగన్ పార్టీ నేతలు కోర్టుకు వెళ్లి దీనిని అడ్డుకున్నారు.

పోలీసులు
సీమాంధ్రలో పలుచోట్ల పోలింగ్ సమయంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో సీమాంధ్ర జిల్లాల్లో భారీగా పోలీసులను మోహరించారు.

పోలీసులు
సీమాంధ్రలో పలుచోట్ల పోలింగ్ సమయంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో సీమాంధ్ర జిల్లాల్లో భారీగా పోలీసులను మోహరించారు. పోలింగ్ సరళిని పరిశీలిస్తున్న కడప పోలీసు అధికారులు.

అద్దాలు ఫట్
పులివెందుల నియోజకవర్గంలోని వేముల మండలం రాజుగుంటపల్లెలో కూడా టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో కొందరికి గాయాలయ్యాయి. కొద్దిసేపు పోలింగ్ ఆపారు.

గాయాలు
కడప జిల్లా తొండూరు మండలం చెర్లోపల్లెలో జగన్ పార్టీ, టిడిపి వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కత్తులతో దాడులకు దిగారు. ఇద్దరు జగన్ పార్టీ కార్యకర్తలకు గాయాలయ్యాయి.

కారు
పులివెందుల మండలం, ఊడలదండ్లలో కూడా ఇరువర్గాలు రాళ్ళదాడులకు దిగాయి. ఏడుగురికి గాయాలయ్యాయి. లింగాల మండలం, కామసముద్రంలో టిడిపి, జగన్ పార్టీ మధ్య గొడవ జరిగింది.

కడప
కమలాపురం నియోజకవర్గం ఎర్రమాచుపల్లె వద్ద వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత, శివారెడ్డి తనయుడు చంద్ర ఓబుల్‌రెడ్డి కారుపై టిడిపి వర్గీయులు దాడి చేశారు.

విశాఖ
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతంలోని పదమూడు జిల్లాల్లో బుధవారం పోలింగ్ జరిగింది. ఓటు వేసి సిరా గుర్తు చూపుతున్న ఓటర్లు.

పోలీసులు
సీమాంధ్రలో పలుచోట్ల పోలింగ్ సమయంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో సీమాంధ్ర జిల్లాల్లో భారీగా పోలీసులను మోహరించారు.

గుంటూరు
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి లక్ష్మారెడ్డి కార్యాలయంలో తాజా మాజీ ఎమ్మెల్యే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హల్‌చల్ చేశారు. జిల్లాలో ఓ ఘటనలో గాయపడ్డ వ్యక్తి దృశ్యం.

పోలీసులు
సీమాంధ్రలో పలుచోట్ల పోలింగ్ సమయంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో సీమాంధ్ర జిల్లాల్లో భారీగా పోలీసులను మోహరించారు.

దగ్ధం
సార్వత్రిక ఎన్నికలలో భాగంగా బుధవారం సీమాంధ్రలో జరిగిన పోలింగ్ స్వల్ప ఉద్రిక్తతలకు దారి తీసింది. పలుచోట్ల తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు బాహాబాహీకి దిగాయి.

పోలీసులు
సార్వత్రిక ఎన్నికలలో భాగంగా బుధవారం సీమాంధ్రలో జరిగిన పోలింగ్ స్వల్ప ఉద్రిక్తతలకు దారి తీసింది. పలుచోట్ల తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు బాహాబాహీకి దిగాయి. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు చేశారు.

పోలీసులు
సార్వత్రిక ఎన్నికలలో భాగంగా బుధవారం సీమాంధ్రలో జరిగిన పోలింగ్ స్వల్ప ఉద్రిక్తతలకు దారి తీసింది. పలుచోట్ల తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు బాహాబాహీకి దిగాయి. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు చేశారు.

కడప
కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రామసుబ్బా రెడ్డి కారు పైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కారు అధ్దాలు పగిలాయి.

టిడిపి, వైయస్సార్ కాంగ్రెస్
రాజంపేట మండలం రోళ్లమడుగు పంచాయతీలోని బాలరాజు పల్లె, పెద్దూరు పోలింగ్ కేంద్రాల్లోకి కొడవళ్లు, గొడ్డళ్లతో చొరబడిన పలువురు చొరబడ్డారు. దీంతో పోలింగ్ కేంద్రంలో రక్తమోడింది. ఈ ఘటనలో టిడిపి నాయకులకు గాయాలయ్యాయి.

వైయస్సార్ కాంగ్రెస్
పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం రాయన్నపాలెంలో ఓటింగ్ జరిగే సమయంలో టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తల నడుమ ఘర్షణ చోటుచేసుకుంది.

టిడిపి, వైయస్సార్ కాంగ్రెస్
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం ములకల్లంకలో టిడిపి, జగన్ పార్టీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో మిల్లి దేశయ్య (70) అనే వృద్ధుడు మృతిచెందాడు. దేశయ్య ఓటువేసి బయటకు వస్తుండగా.. జరిగిన తోపులాటలో కిందపడి మృతిచెందాడు.

పోలీసులు
సార్వత్రిక ఎన్నికలలో భాగంగా బుధవారం సీమాంధ్రలో జరిగిన పోలింగ్ స్వల్ప ఉద్రిక్తతలకు దారి తీసింది. పలుచోట్ల తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు బాహాబాహీకి దిగాయి. చెదరగొడుతున్న పోలీసులు.

పోలీసులు
సార్వత్రిక ఎన్నికలలో భాగంగా బుధవారం సీమాంధ్రలో జరిగిన పోలింగ్ స్వల్ప ఉద్రిక్తతలకు దారి తీసింది. పలుచోట్ల తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు బాహాబాహీకి దిగాయి. విశాఖలో ఆందోళనకారులను చెదరగొడుతున్న పోలీసులు.












Click it and Unblock the Notifications