ఓ మహిళ ఆర్తనాదం.. చనిపోయే ముందు సెల్ఫీ వీడియో..
విజయవాడ : తన మరణ వాంగ్మూలాన్ని సెల్ఫీ వీడియోలో రికార్డు చేసి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన విజయవాడ భవానీపురంలో చోటు చేసుకుంది. అత్తింటివారి వేధింపులు తాలలేకనే తాను ఆత్మహత్యకు చేసుకుంటున్నట్లు, ఆత్మహత్యకు ముందు రికార్గు చేసిన సెల్ఫీ వీడియోలో పేర్కొంది మృతురాలు షేక్ హుష్మ.
చనిపోయే ముందు పిల్లల భవిష్యత్ గురించి ఆవేదన చెందుతున్నట్టుగా చెప్పుకొచ్చిన షేక్ హుష్మ.. అత్త, మామ, ఆడపడుచుల వేధింపులు భరించలేకనే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టుగా తెలిపింది. కాగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతురాలు షేక్ హుష్మ సెల్ఫీ వీడియో ఆధారంగా విచారణ చేపడుతామని తెలిపారు. షేక్ హుష్మకు ఇద్దరు పిల్లలు ఉన్నట్టుగా సమాచారం.













Click it and Unblock the Notifications