మెదక్: విజయశాంతికి అసమ్మతి సెగ, ఇండిపెండెంట్‌గా!

జిల్లా కాంగ్రెస్ కమిటీ కూడా శశిధర్ రెడ్డి అభ్యర్థిత్వాన్నే తెలంగాణ పిసిసి ద్వారా ఎఐసిసికి సిఫారసు చేసింది. అయితే మెదక్ లోకసభకే పోటీ చేయాలనుకున్న విజయశాంతి మనసు మార్చుకుని మెదక్ అసెంబ్లీ టికెట్ కావాలని కాంగ్రెసు పార్టీ అధిష్టానాన్ని కోరారు.
దీంతో అధిష్టానం విజయశాంతికి మెదక్ టికెట్‌ను ఖరారు చేసింది. సంవత్సరాల తరబడి పార్టీని కాపాడుకుంటూ వచ్చిన తనకు కాకుండా విజయశాంతికి టిక్కెట్టు ఇవ్వడం పట్ల శశిధర్ రెడ్డి అసంతృప్తికి వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. శశిధర్ రెడ్డి బరిలో ఉంటే విజయశాంతి విజయం కోసం శ్రమించక తప్పదు.












Click it and Unblock the Notifications