Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ట్విస్ట్: సాయిశ్రీని తల్లే చంపేసింది, వారిద్దరితో నాకు ఎలాంటి సంబంధం లేదు: శివకుమార్

ఇటీవల లుకేమియా వ్యాధితో బాధపడుతూ చనిపోయిన చిన్నారి శివశ్రీ తన కుమార్తె కాదని, అలాగే ఆమె తల్లి వెంకటేశ్వరమ్మ అలియాస్ సుమశ్రీ తన భార్య కాదని మాదంశెట్టి శివకుమార్ ఆరోపించారు.

విజయవాడ: ఇటీవల లుకేమియా వ్యాధితో బాధపడుతూ చనిపోయిన చిన్నారి సాయిశ్రీ తన కుమార్తె కాదని, అలాగే ఆమె తల్లి వెంకటేశ్వరమ్మ అలియాస్ సుమశ్రీ తన భార్య కాదని మాదంశెట్టి శివకుమార్ ఆరోపించారు.ఈ మేరకు ఆయన మీడియాకు ప్రకటనను విడుదల చేశారు. నాన్న నాకు ట్రీట్ మెంట్ చేయించూ అంటూ చనిపోవడానికి కొన్నిరోజుల ముందు సాయిశ్రీ అనే బాలిక పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది.

సాయిశ్రీని సుమశ్రీతో పాటు మరికొందరు కలిసి చంపేశారని ఆయన ఆరోపించారు.ఈ కేసు విషయమై శివకుమార్ ఆరోపణలతో సంచలనానికి కారణమైంది. సాయిశ్రీ మృతిపై సంచలనం కల్గించింది. సుమశ్రీపై పలు ఆరోపణలు చేస్తూ శివకుమార్ ఓ ప్రకటనను మీడియాకు విడుదల చేశారు.

లుకేమియా వ్యాధితో బాధపడుతున్న సాయిశ్రీ ట్రీట్ మెంట్ విషయంలో శివకుమార్ ను డబ్బులు ఇవ్వాలని కోరుతూ సెల్పీ వీడియో రికార్డు చేసింది ఆమె. అయితే విజయవాడలో ప్రస్తుతముంటున్న ఫ్లాట్ ను సాయిశ్రీ పేరున శివకుమార్ రాసిచ్చాడని చెబుతున్నారు.

అయితే ఈ ఫ్లాట్ ను విక్రయించకుండా కొందరు అడ్డుపడడంతో సాయిశ్ట్రీకి ట్ట్రీట్ మెంట్ చేయడానికి ఇబ్బందులు ఏర్పడ్డాయని సుమశ్రీ ఇదివరకే ప్రకటించింది.అయితే ఈ విషయమై విజయవాడలో రాజకీయరంగు కూడ పులుముకొంది. మరో వైపు శివశ్రీకి ట్రీట్ మెంట్ చేయించడానికి ఆమె రెండో భర్త సహయం చేశాడని సాయిశ్రీ ప్రకటించింది.

సాయిశ్రీని చంపేశారు

సాయిశ్రీని చంపేశారు

సాయిశ్రీ చనిపోలేదని ఆమెను సుమశ్రీతో పాటు మరికొందరు కలిసి చంపేశారని శివకుమార్ ఆ ప్రకటనలో సంచలన ఆరోపణలు చేశాడు. చనిపోయిన సాయిశ్రీ తన కుమార్తె కాదన్నారు. ఆమె తల్లి సుమశ్రీ కూడ తన భార్య కాదన్నారు. సాయిశ్రీని చంపినట్టుగా తన వద్ద ఆధారాలున్నాయని ఆయన చెప్పారు. దీనిపై ఇప్పటికే మానవహక్కుల కమిషన్ ను ఆశ్రయించినట్టు చెప్పారు. త్వరలో హైకోర్టులో రిట్ పిటిషన్ ను దాఖలు చేస్తానని చెప్పారు.

కృష్ణకుమార్ కు ఆమె మూడో భార్య

కృష్ణకుమార్ కు ఆమె మూడో భార్య

దుర్గాపురంలో సుమశ్రీతో కలిసి ఉంటున్న కృష్ణకుమార్ ఆమెకు మూడో భార్య అని చెప్పారు. అమ్మాయిలను అక్రమంగా తరలిస్తూ పోలీసులకు చిక్కి చంచల్ గూడ జైలులో శిక్షను అనుభవించి బయటకు వచ్చిన ఓ మహిళ ఆధ్వర్యంలో దుర్గాపురంలోని తన ఫ్లాట్ లో అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నాయన్నారు.ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదులు అందిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

మానవతాథృక్పథంతోనే పాపను పెంచాను

మానవతాథృక్పథంతోనే పాపను పెంచాను

మానవతాథృక్పథంతోనే పాపను పెంచినట్టు శివకుమార్ చెప్పారు.సాయిశ్రీతో కలిసి సుమశ్రీ కొంతకాలం క్రితం తన ఫ్లాట్ లో అద్దెకు దిగిందన్నారు. ఆ తర్వాత రూ.8 లక్షల బంగారు ఆభరణాలను దొంగిలించి హైద్రాబాద్ లోని కృష్ణకుమార్ వద్దకు వెళ్ళిపోయిందని ఆయన ఆరోపించారు. దీనిపై తాను ఆనాడు పామర్రు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుచేసినట్టు గుర్తుచేశారు. కేవలం మానవతాథృక్పథంతోనే పాపను పెంచినట్టు చెప్పారు. సాయిశ్రీ వైద్యానికి రూ.25 లక్షలను ఖర్చుచేసినట్టు చెప్పారు. అయితే వారితో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు.

అన్నీ అనుమానాలే

అన్నీ అనుమానాలే

ఈ కేసులో అన్నీ అనుమానాలే కలుగుతున్నాయి. సాయిశ్రీ వైద్యం కోసం ఫ్లాట్ ను అమ్మకుండా కబ్జాదారులు అడ్డుకొంటున్నారని సుమశ్రీ ఆరోపణలు చేయడంతో రాజకీయరంగుపులుముకొంది.అయితే శివకుమార్ పై ఆరోపణలు చేయడం, శివకుమార్ ప్రతిగా సాయిశ్రీపై ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది.అయితే సాయిశ్రీ వైద్యం కోసం కృష్ణకుమార్ డబ్బులిచ్చినట్టుగా సుమశ్రీ చెబుతోంది.అయితే తాను కూడ రూ.25 లక్షలు ఖర్చుచేసినట్టు శివకుమార్ ప్రకటించాడు. కృష్ణకుమార్ భార్య మొదటి భార్య విజయవాడ పోలీసులను ఆశ్రయించింది. సుమశ్రీపై ఆరోపణలు చేసింది. అసలు ఎవరు చెబుతోంది వాస్తవం, ఎవరు అవాస్తవాలు చెబుతున్నారనే విషయాలు అర్ధంకావడం లేదనే చర్చ సాగుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+