ఏపీ ప్రభుత్వానికి షాక్.. రుషికొండ బీచ్ కు ఆ గుర్తింపు రద్దు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వానికి ఊహించని షాక్ తగిలింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్లూ ఫ్లాగ్ గుర్తింపు పొందిన ఏకైక బీచ్ అయిన విశాఖలోని రుషికొండ బీచ్ కు ఇచ్చిన గుర్తింపు తాత్కాలికంగా రద్దయింది. రుషికొండ వద్ద ఉన్న 600 మీటర్ల తీరప్రాంతాన్ని బ్లూ ఫ్లాగ్ బీచ్ గా 2020 సంవత్సరంలో డెన్మార్క్ కు చెందిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ సంస్థ గుర్తించింది.
రుషికొండ బీచ్ గుర్తింపు రద్దు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్లూ ఫ్లాగ్ గుర్తింపును దక్కించుకున్న తొలి బీచ్ గా రుషికొండ బీచ్ కు గుర్తింపు దొరికింది. ఇక ఈ నేపథ్యంలో తాజాగా దానిని రద్దు చేస్తున్నట్టు వారు ప్రకటించడం ఒక షాక్ అనే చెప్పాలి. ఏపీలోని రుషికొండ బీచ్ కు ఇచ్చిన గుర్తింపును అకస్మాత్తుగా రద్దు చేయడం పట్ల తీవ్ర చర్చ కొనసాగుతుంది.

బీచ్ పై ఫిర్యాదులు , దీంతో తాజా నిర్ణయం
బ్లూ ఫ్లాగ్ గుర్తింపు రద్దు కావడంతో రుషికొండ బీచ్ తీరంలో ఉన్న బ్లూ ఫ్లాగ్ జెండాలను ఏపీ పర్యాటక శాఖ అధికారులు నిన్న కిందికి దించేశారు. ఈ బీచ్ ను సరిగా నిర్వహించకపోవడంతోనే ఎఫ్ ఈ ఈ సంస్థకు దీనిపైన ఫిర్యాదులు వెళ్లినట్టుగా సమాచారం. దీంతో రంగంలోకి దిగిన సంస్థ ప్రతినిధులు తాజా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.
రుషికొండ బీచ్ గుర్తింపు రద్దుకు కారణమీదే
రుషికొండ బీచ్ లో గత కొంతకాలంగా కుక్కలు ఎక్కువగా తిరగడం, బీచ్ లో ఏర్పాటు చేస్తున్న సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, తీరంలో భారీగా ఉన్న వ్యర్ధాలు తీయకపోవడం, బీచ్ లో ఉన్న టాయిలెట్స్ ను, డ్రెస్ చేంజింగ్ రూమ్ లను శుభ్రంగా మెయింటైన్ చేయకపోవడం వంటి అనేక కారణాలు బ్లూ ఫ్లాగ్ హోదా రద్దుకు కారణమని చెబుతున్నారు.
మెయింటెనెన్స్ లేని కారణంగా గుర్తింపు తాత్కాలిక రద్దు
రుషికొండ బీచ్ కి వచ్చిన స్థానికులతోపాటు పర్యాటకులు కూడా బీచ్ నిర్వహణ అధ్వానంగా మారిందని కొన్ని ఫోటోలు తీసి డెన్మార్క్ సంస్థకు గత నెల 13వ తేదీన ఫిర్యాదు చేయగా సరిగ్గా మెయింటెనెన్స్ లేని కారణంగా రుషికొండ బీచ్ కు ఇచ్చిన బ్లూ ఫ్లాగ్ గుర్తింపును తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.












Click it and Unblock the Notifications