వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దమ్ముంటే రా: నామినేషన్ వేసి, అఖిలప్రియకు శిల్పా మోహన్ రెడ్డి సవాల్

నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో వైసిపి తరఫు అభ్యర్థిగా శిల్పా మోహన్ రెడ్డి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు.

|
Google Oneindia TeluguNews

నంద్యాల: నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో వైసిపి తరఫు అభ్యర్థిగా శిల్పా మోహన్ రెడ్డి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు.

బాబుకు మరో షాక్, ఆ పదవి కోసం పట్టు: జగన్ వైపు ఆనం బ్రదర్స్?బాబుకు మరో షాక్, ఆ పదవి కోసం పట్టు: జగన్ వైపు ఆనం బ్రదర్స్?

టిడిపికి ఓటేసేందుకు ఎవరూ సిద్ధంగా లేరు

టిడిపికి ఓటేసేందుకు ఎవరూ సిద్ధంగా లేరు

ఉదయం ఇంటి నుంచి పార్టీ నేతలు, అనుచరులు, కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో రెండు సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికల్లో విజయం తనదేనని, ఉనికిని కాపాడుకునేందుకే కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని రంగంలోకి దింపిందన్నారు. టిడిపికి ఓటు వేసేందుకు ఎవరూ సిద్ధంగా లేరన్నారు.

అఖిలప్రియకు సవాల్

అఖిలప్రియకు సవాల్

నామినేషన్ వేసిన అనంతరం శిల్పా మోహన్ రెడ్డి మాట్లాడారు. నంద్యాలలో తాను గెలవకుంటే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. భూమా బ్రహ్మానంద రెడ్డి ఓడితే మంత్రి అఖిలప్రియ తప్పుకుంటారా అని సవాల్ విసిరారు.

Recommended Video

Chandrababu Gave Promise to Bhuma Akhila Priya Over Nandyal MP
డ్రామాలు మాకు చేతకాదు

డ్రామాలు మాకు చేతకాదు

సవాల్‌ను స్వీకరించే దమ్ము తెలుగుదేశం పార్టీ నేతలకు ఉందా అని శిల్పా మోహన్ రెడ్డి ప్రశ్నించారు. రాజీనామా విషయంలో తనకు డ్రామాలు తనకు చేతకాదని, అందుకే స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా లేఖను పంపానని శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు.

టిడిపికి దమ్ముందా

టిడిపికి దమ్ముందా

పార్టీ ఫిరాయించిన 21 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించే దమ్ము టిడిపికి ఉందా అని సవాల్ చేశారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా నంద్యాలలో వైసిపిదే గెలుపు అన్నారు. శిల్పాకుటుంబం ఎప్పుడూ శాంతిని కోరుకుంటుందని శిల్పా చెప్పారు. దేవుడు ఇచ్చిన దాంట్లో ఎంతోకొంత సమాజానికి చేయాలని తాము తిరిగి ఇస్తున్నామన్నారు. నంద్యాల ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకుంటామన్నారు.

English summary
YSR Congress Party leader Silpa Mohan Reddy on Friday filed nomination for Nandyal bypoll. He said no one is ready to vote Telugu Desam Party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X