కర్నూల్లో వనరులు, కానీ హక్కులేదు: రాజధాని కమిటీ

Sivaramakrishnan Committee visits Kurnool
కర్నూలు: కర్నూలులో అన్ని వనరులు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం పైన వేసిన శివరామకృష్ణన్ సభ్యులు కమిటీ సోమవారం చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని పైన గత కేంద్ర ప్రభుత్వం వేసిన శివరామకృష్ణన్ కమిటీ కర్నూలులో పర్యటించింది. నాటి రాజధాని భవనాలను ఈ కమిటీ పరిశీలించింది. ఈ సందర్భంగా శివరామకృష్ణమన్ కమిటీ సభ్యులు మాట్లాడారు.

ఆగస్టు నెలాఖరున తాము కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర రాజధాని విషయమై నివేదిక ఇస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి తాము రాజధాని పైన అధ్యయనం చేస్తామని చెప్పారు. కానీ, రాజధాని ఎక్కడ ఉండాలి? అనే నిర్ణయించేందుకు తమకు ఏమాత్రం అధికారం లేదని వారు చెప్పారు.

రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఆప్షన్ ఇచ్చి నివేదికను అంద చేస్తామని తెలిపారు. రాజధాని కోసం పూర్తిస్థాయిలో ఏపీలో అధ్యయనం చేస్తామన్నారు. ఆగస్టు నెలాఖరున తాము నివేదిక ఇస్తామన్నారు. ఏపీలోని అన్ని ప్రాంతాలలో పర్యటిస్తామని చెప్పారు.

నిరసనలతో స్వాగతం

కర్నూలులో పర్యటించిన శివరామకృష్ణన్ కమిటీకి నిరసనల స్వాగతం లభించింది. రాయలసీమలోనే రాజధానిని ఏర్పాటు చేయాలని పలువురు నిరసనలు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+